గోదావరి ఖనిలో కార్డన్‌సెర్చ్
Published Tue, Jan 10 2017 11:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం ఇందిరానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్, క్వింటా బొగ్గును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, నలుగురు ఎస్‌ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement