గోదావరిఖని, న్యూస్‌లైన్: ప్రజలకు నష్టం కలిగిస్తూ, సంస్కృతిని, బతుకును విధ్వంసం చేస్తూ కింద బొగ్గును వెలికితీయడం సింగరేణికి సరైంది కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆదివారం గోదావరిఖని సమీపంలోని జనగామ గ్రామంలో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1లో భూగర్భ గనులను విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం ఈనెల 20న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో ఈ బహిరంగసభను నిర్వహించా రు.
ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థపై ఎలాంటి కో పం లేదని, గ్రామాల కింద బొగ్గును వెలికితీసినప్పుడు చేపట్టాల్సిన చర్యలను విస్మరించడం సరికాదన్నారు. 54 ఏళ్ల క్రితం జనగామకు చెం దిన 5వేల ఎకరాల భూమిని తీసుకుని జీడీకె 1,2,2ఏ,3,5వ గనులను ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, గ్రామం లో సింగరేణి అన్ని వసతులు కల్పిస్తుందని ఆశపడ్డారని గుర్తుచేశారు. కానీ సింగరేణి యాజ మాన్యం ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడం తో ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు.
పస్తుతం భూగర్భ గనుల విస్తరణకు భూములను అప్పగించడానికి గ్రామస్తులు వెనుకడుగు వేయడం సరైనదేనని సమర్థించారు. గ్రామంలో పర్యావరణం దెబ్బతిన్నదని, బావులలో నీరు ఇంకిపోయిందని, గోడలు పగుళ్లు తేలాయని, నష్టపరిహారం తక్కువగా చెల్లించారని, తాగేందుకు నీటివసతి కల్పించలేదని సింగరేణిపై ఆయన మండిపడ్డారు. భూగర్భ గనిలో బొగ్గును వెలికితీసిన తర్వాత ఆ స్థలంలో ఇసుకను నింపుతున్నట్లయితే భూమి ఎందుకు కుంగిపోతున్నదో సింగరేణి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో రెండు వందల మందితో మాట్లాడితే వారు విస్తరణకు అంగీకరించారని సింగరేణి చెప్పుకుంటోందని, వారెవరో గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన అధికారులను కోరారు. గ్రామస్తులకు భూమితల్లితో ఉన్న అనుబంధాన్ని తెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. భూములు లాక్కుని డబ్బులిచ్చామని యాజమాన్యం చెబుతున్నా.. ఆ డబ్బు నిర్వాసితులకు శాశ్వత ఉపాధిని కల్పించడం లేదని, కొన్ని రోజులకు డబ్బులు ఖర్చయిన తర్వాత నిర్వాసితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణంపై ప్రభావం చూపుతూ.. మనిషి జీవన గమనాన్ని దెబ్బతీసేలా బొగ్గు తీసే విధానానికి సింగరేణి, ప్రభుత్వం స్వస్థిపలకాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించాలని సూచించా రు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వాయి దా వేయాలని సింగరేణి అధికారులను కోరాలని, ఒకవేళ సభ నిర్వహిస్తే తమ బతుకులకు భరోసా ఇవ్వాలని వేదికపై కూర్చున్న అధికారులను ప్రశ్నించాలని గ్రామస్తులకు సూచిం చారు. తెలంగాణ జేఏసీ పక్షాన తాము కూడా హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీని కలిసి ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని కోరుతామన్నారు.
బాయిలు విస్తరించి.. బతుకులు కూల్చొద్దు
Published Mon, Dec 16 2013 2:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement