మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ‘ఖని’ క్రీడాకారుల ప్రతిభ
24 బంగారు, తొమ్మిది రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్
గోదావరిఖని : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో గోదావరిఖనికి చెందిన పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 60 ఏళ్ల విభాగంలో టి.మనోహర్‌రావు లాంగ్ జంప్, హైజంప్, 100 మీటర్ల పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు, 70 ఏళ్ల విభాగంలో దామెర శంకర్ షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్ రో బంగారు పతకాలు, 50 ఏళ్ల విభాగంలో గూళ్ల రమేష్ 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెంలో మూడు బంగారు పతకాలు, చాట్ల సంజీవ్ ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్‌లో బంగారు పతకాలు, అంబాల ప్రభాకర్ జావెలిన్, డిస్కస్‌త్రో, హ్యామర్‌త్రోలో మూడు బంగారు పతకాలు, 55 ఏళ్ల విభాగంలో డీఎల్.సామ్యెల్ హైజంప్‌లో బంగారు పతకం, 50 ఏళ్ల విభాగంలో పర్శరాములు లాంగ్ జంప్‌లో బంగారు పతకం, 55 ఏళ్ల విభాగంలో తాండ్ర శంకర్ ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం, 40 ఏళ్ల విభాగంలో కాల్వ శ్రీనివాస్ షార్ట్‌పుట్‌లో బంగారు పతకం, డిస్కస్‌త్రోలో రజత పతకం, 35 సంవత్సరాల విభాగంలో విజయకుమార్ లాంగ్‌జంప్‌లో రజత పతకం, పోగుల రామకృష్ణ షార్ట్‌పుట్‌లో బంగారు పతకం, ఆట్ల రమేశ్ 800 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం, మహిళలకు సంబంధించి 55 ఏళ్ల విభాగంలో అనుముల కళావతి జావెలిన్ త్రో, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రోలో మూడు బంగారు పతకాలు, 50 ఏళ్ల విభాగంలో జాగంటి శాంత షార్ట్‌పుట్, 5 కిలోమీటర్ల వాకింగ్, 200 మీటర్ల పరుగుపందెంలో మూడు బంగారు పతకాలు, మంజుల షార్ట్‌పుట్‌లో రజతం, 5 కిలోమీటర్ల పరుగుపందెంలో రజతం, 40 ఏళ్ల విభాగంలో ఉమారాణి వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు సాధించారు.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న మల్లేశ్ వంద మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 24 బంగారు పతకాలు, తొమ్మిది రజత పతకాలు సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ గెలుచుకుందని మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఆరెపల్లి శ్రీనివాస్ తెలిపారు.