ఖనిలో అగ్నిప్రమాదం: 20 దుకాణాలు దగ్ధం | 20 shops burn down in Godavari khani | Sakshi
Sakshi News home page

ఖనిలో అగ్నిప్రమాదం: 20 దుకాణాలు దగ్ధం

Published Fri, Jun 13 2014 8:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

20 shops burn down in Godavari khani

కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్లోని దుకాణాల సముదాయంలో శుక్రవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి.  స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

ఆ ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు దగ్దమైనాయి. రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement