నేడు గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఎన్నికలు | tbgjks elections today | Sakshi
Sakshi News home page

నేడు గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఎన్నికలు

Published Sun, Feb 23 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

tbgjks elections today

గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎ స్ ఎన్నికలు గోదావరిఖని వేదికగా ఆదివారం జరుగనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపొం దేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల నాయకులు గనుల వద్ద ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న తమ యూనియన్ సభ్యులను కలుసుకుని తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులను గోదావరిఖనికి తరలించేందు ఆయా వర్గాల నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

వివరాల్లోకి వెళితే.. 2012 జూన్ 28వ తేదీన జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆ తర్వాత వివిధ కమిటీ ల్లో నాయకుల కు పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారని ద్వితీయశ్రేణి నాయకత్వం కినుక వహించింది. దీంతో వారందరూ సింగరేణి వ్యాప్తంగా ఏకం కాగా, వారికి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నాయకత్వం వహించారు. చివరకు అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించినట్లు సమావేశాల్లో ప్రకటించి కోర్టును ఆశ్రయించ డంతో సింగరేణిలో వర్గపోరు నెలకొంది. ఈ మేరకు హైకోర్టు సూచన మేరకు ఆదివారం రీజినల్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో గోదావరిఖనిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆర్‌ఎల్‌సీ ఐదు కేంద్రాల్లో 11 డివిజన్లకు చెందిన కార్మికులు ఓటు వేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. కాగా శనివారం సాయంత్రం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బందిని ఆర్‌ఎల్‌సీ శ్రీవాస్తవ, డీఎస్‌పీ జగదీశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఆయా సెంటర్లకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రితో తరలించారు.


 రామగుండం, శ్రీరాంపూర్ ఏరియా ఓట్లే కీలకం...


 ఇదిలా ఉండగా, సింగరేణి గుర్తింపు సంఘం అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో సింగరేణిలోని 11 డివిజన్లకు చెందిన 40,752 మంది మంది ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ రామగుండం ఏరియాలోని 10,451 మంది, శ్రీరాంపూర్ ఏరియాలోని 12,358 మంది కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో పోటీ చేస్తున్న అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల ప్యానెళ్లు ఈ రెండు ఏరియాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, శ్రీరాం పూర్ డివిజన్లు గోదావరిఖనికి సమీపంలో ఉండడంతో సభ్య త్వం కలిగిన కార్మికులను ఎక్కువ మందిని తరలించే పనిలో రెండువర్గాల నాయకత్వం నిమగ్నమైంది. కాగా, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కార్పొరేట్ నుంచి కూడా ఓటు హక్కు కలిగిన కార్మికులను బస్సుల ద్వా రా గోదావరిఖనికి తరలించేందుకు నాయకు లు ఏర్పాట్లు చేశారు. అయితే యాజమాన్యం ఆదివారం ప్లేడేను వర్తింపచేయడంతో కొంత మంది కార్మికులు విధులు నిర్వర్తించే అవకాశం ఉంది.
 
 గనులపై ముగిసిన ప్రచారం...
 
 హైకోర్టు ఆదేశాల మేరకు రీజినల్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తున్న టీబీజీకేఎస్ ఆఫీస్ బేరర్ల ఎన్నికల ప్రచారం శనివారం నాటితో ముగి సింది. ఆయాగనులు, ఓపెన్‌కాస్ట్‌లపై కెంగెర్ల, మిర్యాల వర్గాల నాయకులు విస్తృతంగా ప్రచా రం చేపట్టి తమ గుర్తులకే ఓటువేయాలని కో రారు. కాగా, తమకు టీఆర్‌ఎస్ నాయకత్వం మద్దతు ప్రకటించిందని కార్మికులంతా తమకే ఓటు వేసి గెలిపిస్తారని అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య ధీమా వ్యక్తం చేస్తుండగా.. రెండేళ్ల పాలనలో మల్లయ్య కార్మికులకు చేసిందేమీ లేదని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారని, అందువల్ల కార్మికుల అండ తమకే ఉంద ని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి గెలుపు ధీమాలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement