tbgks elections
-
సింగరేణిలో ‘గుర్తింపు’ ఎప్పుడో?
సాక్షి,పెద్దపల్లి: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ఊసులేకుండా పోయింది. కోల్‌బెల్ట్ ప్రాంతం, ఎమ్మెల్యే, ఎంపీల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ ఎన్నికలను ఆచితూచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, కేంద్రం మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గుర్తింపు ఎన్నికల గడువు దాటి నాలుగేళ్లు అవుతోందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. 11 ఏరియాలు 42 వేల మంది కార్మికులు సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో సుమారు 42 వేల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. ఆరు కార్మిక సంఘాలు పోటీలో ఉంటున్నాయి. 1998లో మొదటిసారి రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి నిర్వహించారు. ఈసారి కోవిడ్ కారణంగా గుర్తింపు ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. కోవిడ్ సెకండ్‌వేవ్ తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు కోరినప్పటికీ యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో బొగ్గుగని కారి్మకుల సమస్యల పరిష్కారం కోసం కోలిండియావ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన సింగరేణి యాజమాన్యం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహాయించి మిగతా డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించింది. చర్చల సమయంలో సింగరేణిలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మార్చి చివరినెల కావడంతో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ వెనక్కివెళ్లింది. కార్మిక సంఘాల పట్టు సింగరేణి గుర్తింపు సంఘం గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, అలాగే ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ ఎన్నికలకు ముందే కారి్మకులకు దగ్గర కావాలని చూస్తున్నాయి. బస్సుయాత్ర, జీపుయాత్ర, శిక్షణతరగతులు, జనరల్‌బాడీ సమావేశాల పేరుతో ఇప్పటికే గనుల్లో ఈ సంఘాల నేతలు పర్యటించారు. ఇంకా తేల్చని యాజమాన్యం సింగరేణి గుర్తింపు ఎన్నికలపై యాజమాన్యం ఇంకా తేల్చలేదు. మార్చి¯ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎన్నికలుంటాయని కార్మిక సంఘాలు భావించినా ఎలాంటి నిర్ణయం వెలుబడలేదు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల పక్రియ ప్రారంభిస్తే ఒక్కో షిఫ్టుకు రెండు గంటల మేర అంతరాయం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఆలోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవునికే ఎరుక సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవుడికే ఎరుక. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం. గుర్తింపు యూనియన్లకు సంబంధించిన పత్రాలన్నీ ఎప్పుడో సమర్పించాం. – వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు -
'నేనసలే మొండికేసు.. సంగతి తేలుస్తా'
-
'నేనసలే మొండికేసు.. సంగతి తేలుస్తా'
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కార్మికులు తనను క్షమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఒకసారి టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను గెలిపించారని, సమయం లేక సింగరేణి గురించి పెద్దగా పట్టించుకోలేదని కానీ, ఈసారి మాత్రం అలా ఉండదని చెప్పారు. ఆదివారం సింగరేణి కార్మికులతో ప్రగతి భవన్లో సమావేశం అయిన సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటి వరకు పరిగకంపలాంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నానని ఇకపై సింగరేణిపై దృష్టిపెడతానని అన్నారు. మొన్నటి వరకు ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు సింగరేణి ఇలా ఒక్కొక్కటి బాగుచేయడం మొదలుపెట్టానని తెలిపారు. ఇంకా ఆయనేం మాట్లాడారంటే.. 'సింగరేణి నలు మూలల నుంచి వచ్చిన అందరికీ నమస్కారాలు. టీబీజీకేఎస్‌ను మరోసారి గెలిపించినందుకు అభినందనలు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ను గెలిపించారు. కానీ పని జరగేలేదు.. ఇప్పుడు జరగాలి..గతంలో పరిగకంపలాంటి పరిస్థితులను దాటుకుంటూ వస్తున్న..ఆర్టీసీది కూడా మీలాంటి సంస్థ. ఆర్టీసీకి వచ్చే నష్టం అంతా కూడా హైదరాబాద్ బస్సుల నుంచే వస్తుంది. ఆ నష్టం నుంచి బయటపడేసేందుకు ఏడాదికి రూ.200 కోట్లు జీహెచ్ఎంసీ నుంచి ఇచ్చి ఆర్టీసీని బతికిస్తున్నాను. ఇక ఎలక్ట్రిసిటీ అని ఒకటి ఉంది. అందులో ఉన్నవాళ్లకు కడుపు నిండదు. 25వేలమంది టెంపరరీ ఉద్యోగుల పెట్టిన్రు.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆరు నెలలు పట్టింది. సింగరేణి అన్నలు నన్ను క్షమించాలి. గతంలో టైం లేక శ్రద్ధ పెట్టలేదు. ఈసారి గెలిచిన గెలుపు నిజమైన కార్మికుల గెలుపుకావాలి. ఎన్నికలు గెలిసినప్పుడు సంఘాలు గెలువద్దు. కార్మికులు గెలవాలి. మెడికల్ బోర్డులో మొత్తం లంచాలే కనిపిస్తున్నాయి. లంచం ఇచ్చేటోన్ని ఇప్పిచ్చేటోన్ని, ఇచ్చేటోన్ని చెప్పుతో కొట్టాలి. ఎందుకు కార్మికులు లంచం ఇయ్యాలి. క్వార్టర్ మారినా లంచం ఇవ్వాలంట.. అసలు ఎందుకు ఇవ్వాలి. సింగరేణి క్వార్టర్లకు స్వయంగా వస్తా. మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తా. మీ ఆస్పత్రుల్లో నా బీపీ కూడా చెక్ చేసుకుంట. సభ్యత్వం కింద నెలకు రూ.20 ఇచ్చేవారు.. అలా చేస్తే 53 వేలమంది కార్మికులు నెలకు రూ.13లక్షలు అవుతుంది. అంత పెద్ద మొత్తం అసలు అవసరమే లేదు. ఇక నుంచి రూ.1 ఇస్తే సరిపోతుంది. ఇకపై సింగరేణిలో అన్ని సమస్యలు మీరే రికార్డు చేయండి. స్వయంగా నాలుగు గంటలు కూర్చొని నేనే వాటిని కనుక్కుంటా. కొత్తగూడెం దగ్గర బ్రిటీషోల్లు కట్టిన క్వార్టర్లు ఉన్నాయి.. వాటన్నింటిని మారుస్తా. అబద్ధంలో బతకొద్దు.. అబద్ధాలు చెప్పే యూనియన్లు ఉన్నాయి. 2000 సంవత్సరం తెలంగాణ ఉద్యమంలో నేను వచ్చినప్పుడు కొప్పుల ఈశ్వర్ చెప్పారు. నాది సింగరేణి ప్రాంతం కాదు. విష వాయువుల మధ్య పనిచేస్తారని తెలుసుకొని నాకు బాధేసింది. బొగ్గు పౌడర్ కూడా లోపలికి పోతదంట. ఇక నుంచి సింగరేణి బొగ్గు గని తవ్వుడే కాదు. బయ్యారం గనుల వెలికితీత కూడా సింగరేణికి ఇస్తాం. అండర్ గ్రౌండ్లో 30వేలమంది పనిచేస్తే అందులో వచ్చేది 15శాతం.. ఓపెన్‌లో 85శాతం ఉత్పత్తి వస్తది. కానీ, అధికారులు మాత్రం రివర్స్‌లో చెబుతారు. త్వరలో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ ప్రారంభిద్దాం. ఉక్కు, కాపర్ గనులు సింగరేణికి అప్పగిస్తాం. మెడికల్ బోర్డును తీసేసి కొత్తది పెడతాం. అది మెడికల్ బోర్డా దొంగ బోర్డా. నేనసలే మొండికేసు.. దాని సంగతి తేలుస్తా. ఇక ఉద్యోగం వద్దనుకునే వాళ్లు.. డిపెండెంట్ ఉద్యోగులకు రూ.25లక్షలు ఇస్తాం.. మొత్తం డబ్బు తీసుకోవద్దనుకుంటే దానిని నెలకు రూ.25వేలు ఇచ్చేలా అమలుచేస్తాం. ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి రూ.6లక్షలు ఇచ్చేలా లోన్లు ఇస్తామని చెబుతున్నాం.. మీ కోరిక మేరకు 100శాతం రూ.పది లక్షలు వడ్డీలేని లోనుగా ఇస్తాం. కొత్తగూడెం చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంపీ 15సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. మనల్ని పట్టించుకోని వ్యక్తి మనకు మాత్రం ఎందుకు.. ఆయనను తీసి పారేస్తే ఓ పనైపోతుంది. కార్మికుల కోసం ఏసీ పెట్టిస్తాం.. దానికి ఫ్రీ కరెంట్ కూడా ఇస్తాం. సింగరేణి ఆస్పత్రులను ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతాం. కార్మికులను ఇబ్బంది పెడుతున్న వైద్యాధికారిని మారుద్దాం. పిల్లలకు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం. అంబేద్కర్ జయంతి రోజున ఇక నుంచి సింగరేణి కార్మికులకు సెలవు' అంటూ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా అమలు చేస్తామంటూ పునరుద్ఘాటించారు. -
సింగరేణిలో గులాబీ జెండా!
సాక్షి, కొత్తగూడెం, నెట్వర్క్ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందులో అత్యధికంగా 1,112 మందికి గాను 1,095 మంది (98.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని ఏరియాల్లో సుమారు రెండు గంటలు ఆలస్యంగా ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. అత్యధిక ఏరియాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్ ఆధిక్యత చూపింది. ఇల్లెందు ఏరియా ఫలితాలు ముందుగా తేలగా.. అనంతరం మిగతా ఏరియాల ఫలితాలు వెలువడ్డాయి. గురువారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తుది ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి. ఏరియాలవారీగా విజయం/మెజారిటీ వివరాలు.. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు పోల్‌కాగా.. ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయదుందుభి మోగించింది. ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది. మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్ గెలుపొందింది. బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకుగాను 3,592 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 771 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 ఓట్ల మెజార్టీతో గెలిచింది. భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. రామగుండం–1లో 6,876 ఓట్లకుగాను 6,476 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 366 ఓట్ల మెజార్టీతో విజయం. రామగుండం–2లో 4,221 ఓట్లకుగాను 4,000 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 764 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. రామగుండం–3లో 5,367 ఓట్లకుగాను 5,004 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. రెండింటి మధ్యే పోటీ.. మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆగస్టు 21న సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈ నెల 3 వరకు ప్రచారం జరిగింది. అధికార, విపక్షాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. టీబీజీకేఎస్ తరఫున టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగగా.. విపక్షాల తరఫున కూడా ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే పలు పథకాలను ప్రకటించడంతో పరిస్థితి టీబీజీకేఎస్ వైపు మొగ్గింది. వివిధ యూనియన్ల నుంచి టీబీజీకేఎస్‌లోకి వలసలు జరిగాయి. -
సింగరేణి ఎన్నికల్లో దూసుకెళ్తున్న టీబీజీకేఎస్
సాక్షి, కొత్తగూడెం : సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.93 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గల 11 ఏరియాల్లోని 92 పోలింగ్ బూత్‌లలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం 52,534 ఓట్లు ఉండగా.. 49,873 ఓట్లు పోల్ అయ్యాయి. కార్పొరేట్ డివిజన్లో మొత్తం 1,475 ఓట్లకు.. 95.93 శాతంతో 1,415 ఓట్లు నమోదయ్యాయి. కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకు.. 96.77 శాతంతో 3,592 ఓట్లు, ఇల్లెందు ఏరియాలో 1,112 ఓట్లకు.. 98.47 శాతంతో 1,095 ఓట్లు, మణుగూరు ఏరియాలో 2,883 ఓట్లకు.. 97.68 శాతంతో 2,816 ఓట్లు, రామగుండం-1 ఏరియాలో 6,876 ఓట్లకు.. 94.18 శాతంతో 6,476 ఓట్లు, రామగుండం-2 ఏరియాలో 4,221 ఓట్లకు.. 94.76 శాతంతో 4,000 ఓట్లు, రామగుండం-3 ఏరియాలో 5,367 ఓట్లకు.. 93.24 శాతంతో 5,004 ఓట్లు, భూపాలపల్లి ఏరియాలో 6,854 ఓట్లకు.. 94 శాతంతో 6,415 ఓట్లు, బెల్లంపల్లి ఏరియాలో 1,743 ఓట్లకు.. 96.56 శాతంతో 1,683 ఓట్లు, మందమర్రి ఏరియాలో 6,429 ఓట్లకు.. 95.07 శాతంతో 6,112 ఓట్లు, శ్రీరాంపూర్ ఏరియాలో 11,862 ఓట్లకు.. 94.97 శాతంతో 11,265 ఓట్లు పోలయ్యాయి. రాత్రి ఏడు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలవగా, రాత్రి 12 గంటలకల్లా ఫలితాలు వెలువడనున్నాయి. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను ఈసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో 16 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తాజా మాజీ గుర్తింపు సంఘమైన టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమి మధ్యనే ఉంది. ‘వారసత్వం’ ఎన్నికల ఎజెండాగా మారిన నేపథ్యంలో అధికారంలో ఉన్న తామే ‘ఏదో రకంగా’ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామంటూ గులాబీ దళం సింగరేణి చేజారకుండా శాయశక్తులు ఒడ్డింది. ఇక ఏఐటీయూసీకి కాంగ్రెస్, టీడీపీ, టీ-జేఏసీ మద్దతిస్తున్నాయి. గతంలో కేవలం సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలకు మాత్రమే ఆసక్తికరమైన సింగరేణి ఎన్నికలు.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగగా.. విపక్షాలు కూడా దీటుగా ప్రచారం చేశాయి. కాగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా సింగరేణి ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఆరోసారి ఎన్నికలు.. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. 1998 సెప్టెంబర్ 9న తొలిసారిగా, 2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 ఆగస్టు 9న నాలుగో సారి, 2012 జూన్ 28న ఐదోసారి ఎన్నికలు జరిగాయి. మూడు సార్లు ఏఐటీయూసీ విజయం ఇప్పటివరకు జరిగిన సింగరేణి ఎన్నికల్లో మూడుసార్లు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. ఫలితాలు - హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో టీబీజీకేఎస్ బోణీ కొట్టింది. మొత్తం 86 ఓట్లలో 84 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీబీజీకేఎస్ 77 ఓట్లు, ఏఐసీటీయూకి నాలుగు ఓట్లు, సీఐటీయూకి రెండు ఓట్లు, బీఎంఎస్‌కు ఒక ఓటు పడింది. - ఇల్లందులో 217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గెలుపొందింది. టీబీజీకేఎస్ 617 ఓట్లు పోల్ కాగా.. ఏఐటీయూసీకి 400 ఓట్లు పడ్డాయి. - కొత్తగూడెం కార్పొరేట్లో టీబీజీకేఎస్ విజయ పతాకం ఎగురవేసింది. టీబీజీకేఎస్‌కు 980 ఓట్లు పోల్ కాగా.. ఏఐటీయూసీకి 400 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 580 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. - బెల్లంపల్లిలో టీబీజీకేఎస్ గెలుపు. 174 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీపై టీబీజీకేఎస్ విజయం. - మణుగూరులో టీబీజీకేఎస్ విజయం సాధించింది. 629 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గెలుపు. - శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ గెలుపు. 2200 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ ఘనవిజయం -
నేడు గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎ స్ ఎన్నికలు గోదావరిఖని వేదికగా ఆదివారం జరుగనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపొం దేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల నాయకులు గనుల వద్ద ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న తమ యూనియన్ సభ్యులను కలుసుకుని తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులను గోదావరిఖనికి తరలించేందు ఆయా వర్గాల నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. 2012 జూన్ 28వ తేదీన జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆ తర్వాత వివిధ కమిటీ ల్లో నాయకుల కు పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారని ద్వితీయశ్రేణి నాయకత్వం కినుక వహించింది. దీంతో వారందరూ సింగరేణి వ్యాప్తంగా ఏకం కాగా, వారికి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నాయకత్వం వహించారు. చివరకు అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించినట్లు సమావేశాల్లో ప్రకటించి కోర్టును ఆశ్రయించ డంతో సింగరేణిలో వర్గపోరు నెలకొంది. ఈ మేరకు హైకోర్టు సూచన మేరకు ఆదివారం రీజినల్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో గోదావరిఖనిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆర్ఎల్సీ ఐదు కేంద్రాల్లో 11 డివిజన్లకు చెందిన కార్మికులు ఓటు వేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. కాగా శనివారం సాయంత్రం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బందిని ఆర్ఎల్సీ శ్రీవాస్తవ, డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఆయా సెంటర్లకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రితో తరలించారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియా ఓట్లే కీలకం... ఇదిలా ఉండగా, సింగరేణి గుర్తింపు సంఘం అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో సింగరేణిలోని 11 డివిజన్లకు చెందిన 40,752 మంది మంది ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ రామగుండం ఏరియాలోని 10,451 మంది, శ్రీరాంపూర్ ఏరియాలోని 12,358 మంది కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో పోటీ చేస్తున్న అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల ప్యానెళ్లు ఈ రెండు ఏరియాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, శ్రీరాం పూర్ డివిజన్లు గోదావరిఖనికి సమీపంలో ఉండడంతో సభ్య త్వం కలిగిన కార్మికులను ఎక్కువ మందిని తరలించే పనిలో రెండువర్గాల నాయకత్వం నిమగ్నమైంది. కాగా, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కార్పొరేట్ నుంచి కూడా ఓటు హక్కు కలిగిన కార్మికులను బస్సుల ద్వా రా గోదావరిఖనికి తరలించేందుకు నాయకు లు ఏర్పాట్లు చేశారు. అయితే యాజమాన్యం ఆదివారం ప్లేడేను వర్తింపచేయడంతో కొంత మంది కార్మికులు విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. గనులపై ముగిసిన ప్రచారం... హైకోర్టు ఆదేశాల మేరకు రీజినల్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తున్న టీబీజీకేఎస్ ఆఫీస్ బేరర్ల ఎన్నికల ప్రచారం శనివారం నాటితో ముగి సింది. ఆయాగనులు, ఓపెన్కాస్ట్లపై కెంగెర్ల, మిర్యాల వర్గాల నాయకులు విస్తృతంగా ప్రచా రం చేపట్టి తమ గుర్తులకే ఓటువేయాలని కో రారు. కాగా, తమకు టీఆర్ఎస్ నాయకత్వం మద్దతు ప్రకటించిందని కార్మికులంతా తమకే ఓటు వేసి గెలిపిస్తారని అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య ధీమా వ్యక్తం చేస్తుండగా.. రెండేళ్ల పాలనలో మల్లయ్య కార్మికులకు చేసిందేమీ లేదని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారని, అందువల్ల కార్మికుల అండ తమకే ఉంద ని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి గెలుపు ధీమాలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో కంపెనీ నిర్ధేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యం అందనంత దూరంలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఉన్న కాస్త కాలంలోనైనా సర్వశక్తులు ఒడ్డి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడదామని అనుకుంటే.. ఈనెలలో మేడారం జాతర, టీబీజీకేఎస్ ఎన్నికల కారణం గా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే జాతర వల్ల కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు ఇలానే ఉండేలా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఈనెల 23న గోదావరిఖనిలో జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆ యూనియన్‌కు సంబంధించిన కార్మికులు వెళ్లాల్సి ఉం టుంది. దీంతో మరో మూడు రోజల పాటు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీబీజీకేఎస్‌లో సభ్యత్వం కలిగిన వారు 41 వేల మంది ఉండగా ఇందులో కనీసం 50 శాతమైనా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గోదావరిఖనికి తరలించాల ని పోటీలో ఉన్న రెండు వర్గాలు వ్యూహాలు పన్నుతున్నాయి. దూరంలో ఉన్న కొత్తగూడెం రీజియన్ నుంచి గోదావరిఖని వెళ్లి రావాలంటే కనీసం ఒక రోజు సమయం పడుతుంది. ఒకరోజు ముందగానే కార్మికులను తరలించాలని ఆయా నాయకులు ప్రణాళికలు రూపొందిం చా రు. కనీసం 20వేల మందైనా వెళ్లే అవకాశముం దని సింగరేణి ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటంతో బహిరంగంగా కార్మికులను ఎన్నికలకు వెళ్లవద్దని చెబితే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో వెళ్లినా ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపదని, ఓపెన్‌కాస్టులో పనిచేసే వారు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భా విస్తోంది. వారిని నేరుగా కలిసి పరిస్థితులు వివరించనున్నట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల నాయకులు కార్మికులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో అవసరమైతే పోలీస్, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తోంది.