సుమన్‌కు టీబీజీకేఎస్ బాధ్యతలు
సుమన్‌కు టీబీజీకేఎస్ బాధ్యతలు
Published Tue, Feb 23 2016 12:41 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
మార్చిలో అప్పగించే అవకాశం
నిర్ణయించిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
మంచిర్యాల సిటీ : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలను పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్‌కు అప్పగించడానికి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకు మార్చి మొదటి వారం ముహూర్తం ఖరారైనట్లు తెలిసిం ది. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కాల పరిమితి జూన్ 28తో ముగియనుంది. అప్పటిలోగా సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఎన్నికలకు సన్నద్ధం చేయూలనే సంకల్పంతో యువకుడైన సుమన్‌ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి గనుల్లో పనిచేస్తున్న 58వేల మంది కార్మికులను సంఘం వైపు తిప్పుకోవడంతోపాటు 12 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను కలుపుకొని పోయి, గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ను మళ్లీ గెలిపించుకునే బాధ్యత అంత సులువేమీ కాదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు వస్తాయనే..
గ్రూపు తగాదాలతోపాటు పోలీస్ కేసులు, నాయకులు జైలు పాలు కావడం, కోర్టుల చుట్టూ తిరగడం, సంఘం నిధులు దుర్వినియోగం కావడం వంటి సమస్యలతో టీబీజీకేఎస్ సతమతమవుతోంది. రెండు గ్రూపులుగా విడిపోయిన సంఘం ఏకతాటిపైకి రావడం సాధ్యం కాలేక పోయింది. ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిన కేసీఆర్‌కు సంఘాన్ని చక్కదిద్దలేకపోయారనే పేరు మాత్రం వచ్చింది. ఇబ్బందులు తెచ్చిన వారికే తిరిగి పదవులు కట్టబెడితే మళ్లీ సమస్యలు వస్తాయని, ఆ తరువాత కార్మికుల నుంచి రానున్న ఎన్నికల్లో వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించి ముందుగా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వగా వారు ముం దుకు రాలేదు. చివరకు యువకుడు, దూసుకుపోయే తత్వం, వివాదరహితుడు, అధినేత ఆశీస్సులు ఉన్న ఎంపీ సుమన్‌కు పగ్గాలు అప్పగించడానికి నిర్ణయం జరిగిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ముళ్లకిరీటమే..
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జూన్‌లో రానున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న టీబీ జీకేఎస్‌లో మొదటి నుంచి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అది చినికి చినికి గాలివానలా మారింది. కార్మికులు ఏవగించుకునే స్థాయికికి చేరిపోయింది. ఈ పరిస్థితులను ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కొంత మేర సఫలీకృతమయ్యూయని చెప్పవచ్చు. కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయూ సంఘాల నాయకులు కార్మికుల అభిమానాన్ని చూరగొనగలిగారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం టీబీ జీకేఎస్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో సంఘం బాధ్యతలను ఎంపీ సుమన్ తన భుజస్కం దాలపై వేసుకోబోతున్నారు. ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాలోని నలుగురు ఎంపీలను, 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి పోవాల్సి ఉంటుంది. పార్టీతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు నాలుగు జి ల్లాలో తన కంటే సీనియర్‌లు ఉన్నారు.
అధినేత ఎంత చెప్పినా కీలకమైన పదవిలో ఉన్నప్పటికీ సీనియర్‌లను కలుపుకుని పోవడం సాహసమే. కార్మికులను సంఘం వైపు తిప్పుకోవడం మరో పరీక్ష లాంటింది. అయితే వీటన్నింటినీ పరిష్కరించే ఆయు ధం అధినేత కేసీఆర్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా కార్మికుల సమస్యలపై అవగాహన తప్పనిసరి, ప్రధానంగా నాలుగు దశాబ్దాలుగా కార్మికులను వెంటాడుతున్న ఆదాయపు పన్ను, వారసత్వ ఉద్యోగాలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై వస్తున్న వ్యతిరేకత వంటి సమస్యల పరిష్కారం కోసం ఆయన కార్మికులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
Advertisement