బెల్లంపల్లిలో గుండా మల్లేష్కు షాక్ | gunda mallesh faces trouble from congress | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లిలో గుండా మల్లేష్కు షాక్

Published Mon, Apr 14 2014 9:39 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

బెల్లంపల్లిలో గుండా మల్లేష్కు షాక్ - Sakshi

బెల్లంపల్లిలో గుండా మల్లేష్కు షాక్

కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పలుచోట్ల చిచ్చులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే మహేశ్వరంలో సీపీఐ అభ్యర్థి రంగంలో ఉండగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ బీ ఫారంతో మల్రెడ్డి రంగారెడ్డి పోటీలో ఉన్నారు. తాజాగా సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేష్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్ బరిలో ఉన్నారు. బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది.

ఇక్కడి నుంచి సీపీఐ తరఫున గుండా మల్లేష్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనపైనే కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్ పోటీ చేస్తున్నారు. పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని స్వయంగా టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసినా, శంకర్ మాత్రం ససేమిరా అంటూ బరిలోనే నిలిచారు. దీంతో ఈ వ్యవహారం ఏమిటంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి నేరుగా గుండా మల్లేష్ ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement