క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా.. | Gunda mallesh turns as CPI MLA from Cleaner job | Sakshi
Sakshi News home page

క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా..

Published Thu, Apr 3 2014 1:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా.. - Sakshi

క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా..

కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్   అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థా యికి ఎదిగారు.  ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో  క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి  క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి హోల్‌టైమర్‌గా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లోనూ బెల్లంపల్లి నుంచి  ఎన్నికై సభానాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
     - న్యూస్‌లైన్, బెల్లంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement