కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం | corruption in central and state government | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం

Published Sun, Oct 6 2013 4:33 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

corruption in central and state government

ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి నిలయంగా మారాయని సీపీఐ శాసనసభా పక్షనేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయారన్నారు. యూపీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న దివాళాకోరు విధానాలతో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి బద్రి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement