రాజ్యాంగ హక్కులను కాపాడండి | Rahul Gandhi to launch save the Constitution drive next week | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ హక్కులను కాపాడండి

Published Mon, Apr 16 2018 4:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Rahul Gandhi to launch save the Constitution drive next week  - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించడంతో పాటు రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. దీనికి గానూ ‘సేవ్‌ ద కాన్‌స్టిట్యూషన్‌’ పేరిట దేశవ్యాప్తంగా క్యాంపెయిన్‌ నిర్వహించనుంది. ఈ నెల 23న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇక్కడి తల్కటోరా స్టేడియంలో దీనిని ప్రారంభించనున్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన దళితులు, పౌర సంఘాలు, పంచాయతీ సమితులు సహా పలువురు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం నిర్వహిస్తారని ఎస్సీ విభాగం చైర్మన్‌ నితిన్‌ రౌత్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement