ఆవును దొంగిలించి, చర్మం వొలిచారన్న నెపంతో ముగ్గురు దళితులపై విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గోసంరక్షకుల ముసుగులో బీజేపీ, టీడీపీకి చెందినవారే దళితులపై దాడి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా ప్రభుత్వంగానీ, అధికార పార్టీ నేతలుకానీ స్పందించకపోవడం దారుణమన్నారు