Suspicious Death Of Loving Couple At kuknoor Koppal - Sakshi

పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..

Jan 15 2023 7:42 AM | Updated on Mar 9 2023 4:24 PM

Suspicious Death Of Loving Couple At kuknoor Koppal - Sakshi

సాక్షి, గంగావతి రూరల్‌: ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన  శనివారం కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా బలిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన  ప్రకాష్‌ (20) కుక్కనూరు ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సుమ  సుమ (17)   కుక్కనూరులో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ఆటో, బస్సుల్లో కుక్కనూరుకు వెళ్లివచ్చే క్రమంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది.

వీరిద్దరివి వేర్వేరు కులాలు.  తమ ప్రేమను కుటుంబ పెద్దలకు తెలియజేయగా చదువుకునే వయస్సులో ప్రేమ  ఏంటని మందలించారు. వీరి ప్రేమ వ్యవహారంపై గ్రామస్తులు కూడా తప్పు బట్టారు.  ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కాని  శనివారం సుమ ఇంట్లో  ప్రేమికులిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు.  కుక్కనూరు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. గొంతుల వద్ద గాట్లు ఉన్నట్లు గుర్తించారు.  మృతదేహాలను కుక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు  చేపట్టారు.   

(చదవండి: కొత్త బట్టలు కొని వస్తుండగా ఘోరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement