వానకోసం
వరుణదేవుడి కరుణ కోసం పల్లెజనం పరితపిస్తున్నారు. తడారిన భూముల్లో నీటి చుక్క కోసం నిరీక్షిస్తున్నారు. వానలు కురిపించండమ్మా అంటూ గ్రామదేవతలకు మొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశగంగ ఆదరణ కోసం కలసపాడు గ్రామస్తులంతా శనివారం ఒక చేత్తో కాయా కర్పూరం.. మరో చేత్తో నిండు బిందె తీసుకుని సమైక్యంగా కదిలారు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు అనే భేదభావాలు విస్మరించి అంకాలమ్మ..పోలేరమ్మ.. సత్తెమ్మ.. గంగమ్మలకు ఒక్కొక్కరిక్కి 180 బిందెలతో జలాభిషేకం చేశారు. బోనాలు సమర్పించారు. వానలు కురిపించి కరువు బారి నుంచి కాపాడమని వేడుకున్నారు.
- కలసపాడు