
చంద్రబాబు మోసకారి: కవిత
'ఏపీ సీఎం చంద్రబాబు బొడ్డులో కత్తి పెట్టుకున్నడు. ఏ అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజలను మోసగిస్తడు' అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బోధన్: 'ఏపీ సీఎం చంద్రబాబు బొడ్డులో కత్తి పెట్టుకున్నడు. ఏ అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజలను మోసగిస్తడు' అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. చంద్రబాబు హయంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని విక్రయించారన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి స్థానం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 200 పథకాలు ప్రకటించి, అమలుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇవి చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.