TRS MP Kavitha
-
‘నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్యరచన’
సాక్షి, హైదరాబాద్: నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్య రచన జరిగిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ప్రాచీన తెలంగాణ కవులపై జాగృతి తరపున పుస్తకాలు ముద్రిస్తామన్నారు. ఈ పుస్తకాలను తెలుగు విదేశీయులకు పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాల నుంచి 450మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. అంతకు ముందు రవీంద్రభారతిలో ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ విదేశాల నుంచి మహాసభలకు వచ్చిన ప్రవాస తెలుగువారికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు మహాసభల్లో సాహిత్యానికి పెద్ద పీట వేశామన్నారు. -
పసుపు బోర్డు ఏర్పాటుకు నిరంతర పోరు..
సాక్షి, నిజామాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఇదే విషయంపై కేంద్రానికి రాందేవ్ బాబా లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన లేఖ వల్ల పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. చాలామంది ముఖ్యమంత్రి, జాతీయ నేతలు కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పసుపు రైతులకు మేలు జరిగే ఈ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గత కొంతకాలంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీల ద్వారా ఎంపీ కవిత కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవలి హరిద్వార్ వెళ్లిన కవిత, పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను రాందేవ్ బాబాకు వివరించారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అసోం, కేరళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా కాగా పసుపు పండించే రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు మద్దతు ధర నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ...రాందేవ్ బాబా లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు ఆయన ఈ లేఖ రాశారు. -
చీరలు కాదు.. మిర్చి అమ్మండి
- కవిత, కేటీఆర్‌లపై జీవన్‌రెడ్డి సెటైర్స్ - రైతులకు న్యాయమైన ధర పోగా మిగిలింది మీరే తీసుకోండి - టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ సాక్షి, హైదరాబాద్: ఏసీ రూముల్లో ఐస్‌క్రీమ్‌లు అమ్మినట్లే.. రైతులు కష్టపడి పండించిన మిర్చి పంటను అమ్మించాలని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన.. మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలపై సెటైర్లు విసిరారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు అమ్మి, కూతురు కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారు. అదే మార్కెటింగ్ నైపుణ్యంతో రైతులు పండించిన పంటను అమ్మాలి. రైతులకు న్యాయమైన ధరను చెల్లించి, ఎక్కువ వచ్చిన డబ్బును టీఆర్ఎస్ సభలకే ఖర్చు పెట్టుకోవచ్చు’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంటలకి బోనస్ ఇచ్చామని, 1800 వున్న పత్తి విత్తనాల ధరను 800కి తగ్గించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిదేనని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రచారానికి, ఆర్భాటాలకు తప్ప చెప్పినవి అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పక్కరాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులు పండించిన పంటకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల దృష్టి మళ్లించడానికే వచ్చే సంవత్సరం నుండి ఉచిత ఎరువులు అని సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని, ఊకపదంపుడు ఉపన్యాసాలతో ఫలితం శూన్యమని జీవన్ రెడ్డి అన్నారు. అధికార గర్వంతో మాట్లాడతారా? -
బీజేపీ మత కల్లోలాలు సృష్టించే పార్టీ
-
సాయమడిగితే ఎంపీ కవిత తక్షణమే స్పందన
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండగ బతుకమ్మ. అయితే ఆ పండుగ కోసం పండుగ కోసం పూలు కోసి తెచ్చేందుకు వెళ్లిన ప్రయత్నంలో తనకు కరెంట్ షాక్ తగిలిందని.. ఈ ప్రమాదంలో తాను రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు సాయం చేయాలని మంచిర్యాల, నస్పూర్ కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఎస్ శేఖర్ ట్విట్టర్ ద్వారా టీఆర్ఎస్ ఎంపీ కవితను కోరారు. ఈ ఘటన 2014 జనవరి 10వ తేదీన జరిగిందని.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసిన ఎలాంటి సాయం అందలేదని బాధితుడు శేఖర్ ట్విట్లో పేర్కొన్నాడు. బాధితుడు శేఖర్ ట్వీట్ పై ఎంపీ కవిత వెంటనే స్పందించారు. మీకు తప్పకుండా సహాయం చేస్తామని ఆమె రీట్వీట్ చేశారు. శేఖర్ పూర్తి వివరాలను సంతోష్.జాగృతి@జీమెయిల్.కామ్ కు పంపించాలని ఆమె ట్వీట్ లో సూచించారు. గత కొన్ని రోజుల నుంచి తనకు సాయం చేయాలని శేఖర్ ట్వీట్లు చేస్తుండగా ఎట్టకేలకు అతడికి సాయం అందనుంది. రెండు కాళ్లు కోల్పోయినప్పుడు ట్రీట్ మెంట్ కోసం దాదాపు రూ.18 లక్షలు ఖర్చుపెట్టామని.. ఆర్థికంగా ఆదుకోవాలని ఇటీవల వరుస ట్వీట్లు చేశాడు. ఈసీఈ విభాగంలో బీ.టెక్ పూర్తిచేసిన తనకు వికలాంగుల కోటాలో తన చదువుకు తగ్గ జాబ్ ఇప్పించాలని ఇటీవల టీఆర్ఎస్ నేతలకు మొర పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎంపీ కవిత బాధితుడు శేఖర్ ట్వీట్లపై స్పందించి.. తప్పకుండా సాయం చేస్తామని, వివరాలు తెలపాలని చెప్పారు. Tappakunda .. pls send me your details on santosh.jagruthi@gmail.com https://t.co/Oz9RzIeeP4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) 4 April 2017 @RaoKavitha madam 10.1.14 roju bathukamma flwrs ki velli curent shock valla 2legs poyayi CM fond apply chesam raledu madam plz ippinchandi pic.twitter.com/hfvYh9W3qs — s shekhar (@shekhar436) 4 April 2017 -
చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ఫైర్
-
చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ఫైర్
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని, ఆయన తన బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారని ఆమె మండిపడ్డారు. ఆది నుంచి తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేస్తూనే ఉన్నారని కవిత శుక్రవారమిక్కడ అన్నారు. తెలంగాణలో టీడీపీ ఉండటానికి అర్హత లేదనే విధంగా చంద్రబాబే నిరూపించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ దుకాణాన్ని మూసుకుంటే బాగుంటుందని కవిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు: ఈటల హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకే అసహనంతో విమర్శలు చేస్తున్నారని ఈటల శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ను అవమానించేలా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఇవ్వాలని కోరినవారిలో చంద్రబాబు కూడా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ఒక్కరే పార్లమెంట్లో అంతమంది ఎంపీలను బలవంతంగా కూర్చోబెట్టి రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేయించగలరా అని ఈటల ప్రశ్నించారు. -
మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఏదీ?
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఎంపీ కవిత సాక్షి, అమరావతి బ్యూరో: మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లేదని నిజామబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీలు కులాల పేరిట రెచ్చగొట్టి.. మహిళపై మహిళలనే ఉసిగొల్పి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్లపై హామీ ఇచ్చినందున.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో కవిత శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కోసం దేశ వ్యవస్థలో మార్పులు, సామాజిక అంశాలపై చర్చ జరుగుతోందని.. దేశంలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలని కొందరు చెబుతుండడం దురదృష్టకరమని కవిత వ్యాఖ్యానించారు. అలాంటి ప్రకటనలు మహిళా శక్తిని కించపరచడమేనని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో సామాజిక కారణాలను చూడాలని స్పష్టం చేశారు. మహిళలు హక్కుల కోసం పొరాడితే హింస పెరుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, దానికి తాము అండగా నిలుస్తామని కవిత చెప్పారు. ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీలు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల హామీల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా తప్పక ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. దుర్గమ్మకు సారె సమర్పించిన కవిత సదస్సులో పాల్గొనడానికి ముందు ఎంపీ కవిత.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమతో పాటు కుంకుమ భరిణె, పూలు, పండ్లు, వడి బియ్యం సమర్పించారు. 48% ఓటర్లకు 11% ప్రజాప్రతినిధులా?: నటి మనీషా కొయిరాలా భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 11 శాతంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘నేను పుట్టినప్పుడు మా తాత ఎంతో బాధపడ్డారట. ఆడపిల్ల పుట్టిందే అని ఆయన ముఖం చిన్నబోయిందట. నేను పెద్ద అయిన తరువాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందా. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఆ ఆవేదన తీరలేదు. ఇలాంటివాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత యువతులదే’ అన్నారు. -
మహిళా స్వేచ్చ అన్నది మన రక్తంలోనే ఉంది
-
లోకేష్ ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే మంచిది..
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌పై టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని కవిత వ్యాఖ్యానించారు. అన్నా హజారేలమని చెప్పుకొని ఆస్తులు ప్రకటించుకోవటం హాస్యాస్పదమన్నారు. మాసం తిని బొక్కలు మెడలో వేసుకుని వాళ్లం కాదని కవిత ఎద్దేవా చేశారు. ఆమె శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు. మహిళలు మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మకు విశేష ఆదరణ లభించిందన్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండుగను గుర్తించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కవులు, కళాకారులను గౌరవించుకోగలిగామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బహుభాషా కోవిదుడు అయినప్పటికీ...ఆయనకు సొంతగడ్డపై రావాల్సినంత కీర్తిప్రతిష్టలు రాలేదన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక కృషి చేశారని కవిత అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు ప్రజలన గందరగోళానికి గురి చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. రాజకీయాలను నీచస్థాయికి దిగజార్జిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు, తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నమని కవిత అన్నారు. -
లోకేష్ ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే మంచిది..
-
‘గిన్నీస్లో ఎక్కేలా బతుకమ్మ వేడుక’
-
‘గిన్నీస్లో ఎక్కేలా బతుకమ్మ వేడుక’
హైదరాబాద్ : బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్‌లో ఎక్కే విధంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ 30వేల మందితో బతుకమ్మ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 1100 చోట్ల, 9 దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. కాగా తెలంగాణ జాగృతి యాప్‌ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందన్ని, తెలంగాణ జాగృతి యాప్‌ను లాంచ్ చేయడం గర్వంగా ఉందన్నారు. యాప్ ద్వారా తమ సంస్థ గ్రాస్ రూట్ లెవల్లో పని చేయగలుగుతుందన్నారు. ఇక వరద విషయాన్ని విపక్షాలు రాజకీయం చేయడం తగదని ఎంపీ కవిత పేర్కొన్నారు. రెండు, మూడు కాలనీల్లో నీళ్లొస్తే హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని కొంతమంది దుష్ప్రచారం చేశారన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణలో కూడా పర్యటించి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు. కాగా ఈ నెల 30న యూఏఈలో బతుకమ్మ ఉత్సవాలకు కవిత హాజరు కానున్నారు. -
బాబా రాందేవ్‌తో ఎంపీ కవిత భేటీ
హైదరాబాద్: నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత శుక్రవారం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్‌తో భేటీ అయ్యారు. పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు విషయంపై కవిత ఈ సందర్భంగా రాందేవ్ మద్దతు కోరారు. పతాంజలి నుంచి రైతులకు మేలు జరిగేలా పసుపు ఆధారిత పరిశ్రమను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఎంపీ కవిత విజ్ఞప్తికి బాబా రాందేవ్ సానుకూలంగా స్పందించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతులకు మేలు చేస్తానని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకై కేంద్రానికి లేఖ రాస్తానని బాబా రాందేవ్ తెలిపారు. బాబా రాందేవ్‌తో భేటీ అయినవారిలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్, జీవన్ రెడ్డి, జగిత్యాల టీఆర్ఎస్ అధ్యక్షులు సంజయ్ కుమార్ ఉన్నారు. కాగా ఎంపీ కవిత గతంలోనూ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. A big thank U to Guru ji @yogrishiramdev for supporting the initiative for a separate Turmeric Board. @narendramodi pic.twitter.com/WIqmTwZQFS — Kavitha Kalvakuntla (@RaoKavitha) 16 September 2016 -
బ్రిక్స్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఫోరం
జైపూర్: బ్రిక్స్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఫోరం శనివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బ్రిక్స్ సమావేశాన్ని ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల నుంచి 42మంది మహిళా ప్రతినిధులు పాల్గొంటున్నారు. బ్రెజిల్ నుంచి ఐదుగురు, రష్యా నుంచి ముగ్గురు, భారత్ నుంచి 28 మంది, చైనా నుంచి ఇద్దరు, సౌతాఫ్రికా నుంచి నలుగురు మహిళా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. నిజామాబాద్ ఎంపీ కవిత, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, సుప్రియా సూలె, వసుంధర రాజె తదితరులు పాల్గొన్నారు. Meeting of BRICS women parliamentarians' forum in Rajasthan Vidhansabha (Jaipur) pic.twitter.com/N7tl69oodO — Kavitha Kalvakuntla (@RaoKavitha) 20 August 2016 -
బీజేపీతో దోస్తీ లేదు
-
తెలంగాణకు ఆయన ఆగర్భ శత్రువు: కవిత
నిజామాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు చంద్రబాబు ఆగర్భ శత్రువని కవిత విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారని మండిపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభలో తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. తెలంగాణ ఎంసెట్-2ను రద్దు చేయడంపై కవిత స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్ కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎంసెట్ పరీక్షపై సోమవారం వివరణ ఇస్తారని చెప్పారు. -
బీజేపీకి సవాల్ విసిరిన ఎంపీ కవిత
హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సాయంపై బీజేపీకి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. రెండేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆమె శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్దంగా అందాల్సిన నిధులు మాత్రమే రాష్ట్రానికి అందాయని కవిత తెలిపారు. అంతకన్నా తెలంగాణకు అదనంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వంటి ముఖ్య నేతలు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. హైకోర్టు విభజనపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కవిత సూటిగా ప్రశ్నించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 41 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్న విషయం తెలిసిందే. మరో వైపు కాంగ్రెస్ నాయకులపై ఆమె మండిపడ్డారు. ఆంధ్రా వాళ్లకి అమ్ముడుపోయిన వ్యక్తి కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్.. ముందుగా తన పార్టీని చక్కదిద్దుకోవాలని కవిత విమర్శించారు. నాయకత్వ లోపం ఉంది కాంగ్రెస్లోనేనని చెప్పారు. ఓర్వలేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్లో దొంగచాటు రాజకీయాలు లేవు.. ఇప్పుడు కాదు.. ఎప్పుడు, ఎవరు వచ్చినా కండువా కప్పి ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ నేతల నిజాయితీ ఏమిటో ప్రజలకు తెలుసునని, కమీషన్ల కోసం కక్కుర్తిపడే నాయకులు టీఆర్ఎస్లో లేరన్నారు. నీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ అని హడావుడి చేశారు.. ఆ సంగతి ఏమైంది? అని ప్రశ్నించారు. -
తెలంగాణ ఏర్పాటులో సోనియా సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల దుఃఖాన్ని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయం చేశారని టీఆర్ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ‘‘మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీరు (స్పీకర్ సుమిత్రా మహాజన్) ఇటీవల చట్టసభల మహిళా ప్రతినిధులతో రెండు రోజులపాటు సదస్సు ఏర్పాటు చేశారు. ఒక మహిళగా నిర్ణయం తీసుకోగలిగిన స్పీకర్ పదవిలో ఉన్నందునే ఇది సాధ్యమైంది. శక్తివంతమైన స్థానాల్లో మహిళలు ఉంటే అందరికీ సాయపడొచ్చు. న్యాయం కూడా జరుగుతుంది. మేడమ్ సోనియా గాంధీ అలా శక్తివంతమైన స్థానంలో కూర్చున్నప్పుడు మా ప్రజలకు సాయం చేయగలిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె సాయం చేశారు. ఆమె మా దుఃఖాన్ని అర్థం చేసుకున్నారని, అందుకే సాయం చేశారని మాకు అనిపిస్తుంది..’’ అని కవిత వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహం చేపట్టినప్పుడు ఏర్పాటు చేసిన 70 మంది బృందంలో మహిళలు లేరని... సత్యాగ్రహంలో తమను ఎందుకు చేర్చుకోవడం లేదంటూ సరోజినీ నాయుడు సహా వందలాది మహిళలు నిరసన తెలిపారన్నారు. దాని తర్వాతే వేలాది మంది మహిళలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. దేశానికి తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం ఐదు శాతం మందే మహిళా ఎంపీలు ఎన్నికయ్యారని, ప్రస్తుతం అది నెమ్మదిగా 12 శాతానికి పెరిగిందని కవిత పేర్కొన్నారు. అయితే మహిళలను రాజకీయ ఉద్యమాల్లో వెనక్కి నెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి కుటుంబాల మహిళలకూ కష్టాలు! సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనూ మహిళలు కష్టాలు ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. తాను చాలా మంది మహిళలతో మాట్లాడానని...పెళ్లిళ్ల అనంతరం తాము ఒక పంజరం నుంచి వచ్చి మరో పంజరంలో పడ్డట్టుగా అనిపిస్తోందని వారు చెప్పారన్నారు. ‘‘ఆడపిల్లపై తొలుత అమ్మా, నాన్న, సోదరుడు అధికారం చెలాయిస్తారు. పెళ్లి అనంతరం అత్త-మామ, భర్త అధికారం నడుస్తుంది. మహిళల జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఉన్నత స్థాయి కుటుంబాల్లోనూ ఇలాగే ఉంటోంది. తేడా ఏమిటంటే అద్దాల మేడ నుంచి అది కనిపించదుగానీ వారిదీ అదే పరిస్థితి..’’ అని కవిత పేర్కొన్నారు. మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉందని... ఆడపిల్లలను తప్పనిసరిగా చదివిస్తే దేశంలో మార్పు వస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. -
బాబు మౌనమే ఏపీకి శాపం: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి కేంద్రం డబ్బులిస్తామని చెప్పి ఇవ్వడం లేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. వీటన్నింటినీ ఎత్తిచూపే సమయం ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు మౌనం ఏపీకి శాపంగా మారింది. బాబుకు ప్రధాని మోదీతో రాజకీయ పొత్తు ముఖ్యమా.. లేక ప్రజలతో పొత్తు పెట్టుకోవడం ముఖ్యమా..?’ ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. బిహార్‌కు మోదీ రూ.లక్షా 25 వేల కోట్లు ప్రకటించినప్పటికీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్న బాబు ఏపీ విషయంలో ఏమీ మాట్లాడని వైఖరిని తప్పుపట్టాల్సిందే అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము చూసిన ఆత్మహత్యలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయని, యువతీయువకులు ధైర్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని ఓ సోదరిలా విన్నవిస్తున్నానన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించుకోవడానికి ఏపీతో కలసి కేంద్రంపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని, బాబు కూడా పారదర్శకతతో ముందుకు రావాలని పిలుపునిచ్చా రు. తాగు, సాగునీటి ఇబ్బందులకు బాబు వైఫల్యమై కారణమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులపై నిలదీయకపోవడం వల్లే కృష్ణా, గోదావరి జలాల కొరత ఉందన్నారు. రాజకీయ పొత్తులో ఉన్న విషయాన్ని మరిచి తెలుగువారిగా నీటి ఉద్యమాలకు కలసి రా వాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని కడుతుండగా, నిలిపివేయించడానికి బాబు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోర్ అంశాలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజనలో కమిటీలు వేయకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డా రు. కేంద్ర మంత్రి వెంకయ్య అభిప్రాయాల కన్నా చట్టంలోని అంశాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రాధాన్యతనివ్వాలన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌కు పరామర్శ టీఆర్ఎస్ ఎంపీ కవిత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించారు. రాష్ట్రపతి సతీమణి సువ్రాముఖర్జీ మృతిపట్ల సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సునీతా మహేందర్ రెడ్డి, కోవ లక్ష్మి, శ్రీనివాస్‌గౌడ్, పుట్టా మధు, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత
న్యూఢిల్లీ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హాల్లో కలిశారు. తెలంగాణకు చెందిన వివిధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా ప్రధానితో చర్చించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కాగా ఎంపీ కవిత ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రధానితో చర్చించిన అంశాలపై ఆమె ప్రకటన చేయనున్నారు. -
'కేబినెట్లో చేరేందుకే కవిత.. మోదీ భజన'
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్లో చేరేందుకే టీఆర్ఎస్ ఎంపీ కవిత...ప్రధాని మోదీ భజన చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన లబ్ది ఏమిటో టీఆర్ఎస్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంతమేర న్యాయం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
నాన్న స్టార్ బ్యాట్స్‌మెన్...:కవిత
-
ముంబైలో తెలంగాణ భవన్
టీఆర్ఎస్ ఎంపీ కవిత హామీ * ఘనంగా పద్మశాలి సంఘం పసుపు కుంకుమ సాక్షి, ముంబై: ముంబైలో తెలంగాణ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ముంబై ప్రభాదేవిలోని రవీంద్ర నాట్యమందిర్ హాల్లో బుధవారం రాత్రి జరిగిన ‘ఓం పద్మ శాలి సేవా సంఘం’ పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ వలసవచ్చిన తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం భేటీ కానున్నారు. ఆ సమయంలో తెలంగాణ భవనం అంశాన్ని గూర్చి మాట్లాడాలని తాను సీఎం కేసీఆర్ కార్యాలయానికి ఫోన్ చేసి సూచించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో మహారాష్ట్ర భవనం కోసం తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల ముంబైలో కూడా తెలంగాణ భవనం కోసం స్థలం లభించగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. వలసబిడ్డలు స్వగ్రామలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. అదే విధంగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు నేరుగా ముంబై నుంచి బస్సులను నడిపే విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటామని కవిత చెప్పారు. తెలుగు భవనానికి సహకరిస్తాం: సునీల్ శిందే.. తెలుగు భవనం ఏర్పాటుకు తాము కూడా సహకరిస్తామని శివసేన ఎమ్మెల్యే సునీల్ శిందే చెప్పారు. టీఆర్ఎస్ నాయకురాలు కవిత సూచన మేరకు తాను కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ రాస్తానని అన్నా రు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. ఘనంగా పసుపు-కుంకుమ ఓం పద్మశాలి సేవా సంఘం పసుపు-కుంకుమ కార్యక్రమం, సంస్థ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన ‘ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఆఫ్ అభినయ నృత్య బృందం’ వారు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జానపద గేయాలతో పాటు నృత్య ప్రదర్శనలతో కళాకారులు మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకురాలైన కవిత, శివసేన ఎమ్మెల్యే సునీల్ శిందే, నిజామాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, మోర్తాడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ నూకల విజయ్‌కుమార్‌లను ఆ సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, కార్యవర్గ సభ్యులు శాలువాకప్పి సత్కరించారు. ఉత్తమసేవలందించిన వారికి నవరత్నాల బిరుదు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన తొమ్మిది మందిని ఎంపికచేసి వారికి నవరత్నాలుగా బిరుదు ఇచ్చి సత్కరించారు. ఈ బిరుదులు అందుకున్న వారిలో సాహిత్యంలో సంగెవేణి రవీంద్ర, భవన నిర్మాణ రంగంలో నాగేంద్ర దేవానంద్, ఆర్థికరంగంలో సీఎ అశోక్ రాజ్గిరి, క్రీడా రంగంలో సంగం జనార్దన్, వైద్య రంగంలో డాక్టర్ దంతాల పురుషోత్తం, హెరిటేజ్ భవన పరిరక్షణ రంగంలో సుల్గే శ్రీనివాస్, సామాజిక రంగంలో కోడూరి శ్రీనివాస్, విద్యా రంగంలో భవిత పెంట, ఆథ్యాత్మిక సామాజిక రంగంలో కె హనుమంతురావులున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రమహాసభ ట్రస్టీ చైర్మన్ ఏక్నాథ్ సంగం, అధ్యక్షులు సంకు సుధాకర్, ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సెవై రాములు, రేణుక సంగం తదితరులతోపాటు ఓం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు పోతురాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, ఉపాధ్యక్షులు అంబల్ల గోవర్ధన్, చౌటీ నారాయణ్ దాస్, చాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసకారి: కవిత
బోధన్: 'ఏపీ సీఎం చంద్రబాబు బొడ్డులో కత్తి పెట్టుకున్నడు. ఏ అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజలను మోసగిస్తడు' అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. చంద్రబాబు హయంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని విక్రయించారన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి స్థానం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 200 పథకాలు ప్రకటించి, అమలుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇవి చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.