బాబా రాందేవ్తో ఎంపీ కవిత భేటీ
హైదరాబాద్: నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత శుక్రవారం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్తో భేటీ అయ్యారు. పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు విషయంపై కవిత ఈ సందర్భంగా రాందేవ్ మద్దతు కోరారు. పతాంజలి నుంచి రైతులకు మేలు జరిగేలా పసుపు ఆధారిత పరిశ్రమను నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించారు.
ఎంపీ కవిత విజ్ఞప్తికి బాబా రాందేవ్ సానుకూలంగా స్పందించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతులకు మేలు చేస్తానని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకై కేంద్రానికి లేఖ రాస్తానని బాబా రాందేవ్ తెలిపారు. బాబా రాందేవ్తో భేటీ అయినవారిలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్, జీవన్ రెడ్డి, జగిత్యాల టీఆర్ఎస్ అధ్యక్షులు సంజయ్ కుమార్ ఉన్నారు. కాగా ఎంపీ కవిత గతంలోనూ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే.
A big thank U to Guru ji @yogrishiramdev for supporting the initiative for a separate Turmeric Board. @narendramodi pic.twitter.com/WIqmTwZQFS
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 16 September 2016