సాక్షి, నిజామాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఇదే విషయంపై కేంద్రానికి రాందేవ్ బాబా లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన లేఖ వల్ల పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. చాలామంది ముఖ్యమంత్రి, జాతీయ నేతలు కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.
పసుపు రైతులకు మేలు జరిగే ఈ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గత కొంతకాలంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీల ద్వారా ఎంపీ కవిత కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవలి హరిద్వార్ వెళ్లిన కవిత, పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను రాందేవ్ బాబాకు వివరించారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అసోం, కేరళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాగా కాగా పసుపు పండించే రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు మద్దతు ధర నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ...రాందేవ్ బాబా లేఖ రాశారు. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు ఆయన ఈ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment