Turmeric board
-
కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్
సాక్షి, సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌ను కాదని యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
నిజామాబాద్ లో పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
-
‘పసుపు బోర్డు సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాశా’
ఢిల్లీ: పసుపు బోర్డు(Turmeric Board) సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాసిచ్చానని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind) స్పష్టం చేశారు. పట్టువదలకుండా కేంద్రం చుట్టూ తిరిగి దీన్ని సాధించగలిగానన్నారు. ఈ అంశానికి సంబంధించి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘పసుపు బోర్డు సాధనతో నాకు ఎంతో సంతృప్తి కల్గింది. బోర్డుతో పసుపు రైతుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. బోర్డు తీసుకొచ్చామని చెప్పే బిఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలవి చిల్లర మాటలు. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలి. నిజామాబాద్ లో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరగబోతోంది. పవర్లోకి తీసుకొచ్చే వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పడంలో తప్పేంలేదు. మా పార్టీలో అధ్యక్ష రేసులేదు. అధ్యక్షుడు ఎవరనేది నరేంద్ర మోదీ నిర్ణయిస్తారు. పవర్లోకి రావడం ఏ పార్టీకైనా ఒక ఆశయంగా ఉంటుంది. నా తదుపరి టార్గెట్ నిజామాబాద్‌లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడమే’ అని పేర్కొన్నారు.ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరిన వేళ..కాగా, రైతుల పండుగ సంక్రాంతి(Makara Sankranti) నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది..అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.సాకారమైన రైతుల పోరాటంపసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే..నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది. -
కొత్త వంగడాలు, మార్కెట్ సేవలు అందుబాటులోకి : గంగారెడ్డి
-
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
నిజామాబాద్, సాక్షి: రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది. .. అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. ఇక.. ఇటు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డి, స్పైసెస్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమశ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భారీగా హాజరైన పసుపు రైతులు.. ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.అంతకు ముందు.. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుంది’’ అని అన్నారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ మాత్రం అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సాకారమైన రైతుల పోరాటంపసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే.. నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది.మన పసుపు మార్కెట్ ఇదిప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగవుతోంది. 202223 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. 202223లో 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 62 శాతం. తొలి చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిపల్లె గంగారెడ్డి అంకాపూర్లోని రైతు కుటుంబంలో పుట్టారు. డిగ్రీ చదివారు. తొలుత ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 1991 నుంచి 1993 వరకు అంకాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1997 వరకు బీజేపీ ఆర్మూర్ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు తొలి ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ.. కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. -
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ఛైర్మన్‌గా తెలంగాణ వాసి పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సోమవారం(జనవరి 13) నోటిఫికేషన్ విడుదల చేసింది. పల్లె గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి. సంకక్రాంతి వేళ పసుపు రైతులకు శుభవార్త చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును నోటిఫై చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇది చాలా గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ కేంద్రంగా మంగళవారం నుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అర్వింద్ తెలిపారు. గతంలో పసుపుబోర్డుపై నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు నడిచాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల వరకు పసుపు బోర్డు కాకపోయినప్పటికీ స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరిగి ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. ఎట్టకేలకు 2025లో సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం నోటిఫై చేసింది. -
పసుపుబోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి మూడు కీలక అంశాలపై బుధవారం కేంద్ర కేబి నెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క–సారక్క కేంద్రీయ గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సమ్మక్క సారక్క వర్సిటీకి రూ. 889.07 కోట్లు నిధులు కేటాయించింది. ఇక తె లంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కృష్ణా వాటర్ డిస్ప్యూ ట్స్ (బ్రిజేశ్) ట్రిబ్యునల్–2ను కేబినెట్ ఆదేశించింది. ఎంతోకాలం నుంచి కొనసాగుతున్న జల వివాదాలకు ఇది ఒక పరిష్కారం చూపే అవకా శం ఉంది. తెలంగాణలో వారం రోజుల్లో ప్రధా ని వరుసగా రెండోసారి పర్యటించిన మరునాడే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అనురాగ్‌సింగ్ ఠాకూర్, ఎల్.మురుగ న్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సమ్మక్క–సారక్క గిరిజన వర్సిటీకి రూ.889.07 కోట్లు ఏపీ పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు చట్టం–2009ను సవరిస్తూ పార్లమెంటులో కేంద్ర విశ్వవిద్యాలయాలు (సవరణ) బిల్లు–2023ను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గిరిజన యూని వర్సిటీ కోసం కేంద్రం రూ.889.07 కోట్లు నిధు లు కేటాయించింది. ఈ వర్సిటీ రాష్ట్రంలో విద్యా భివృద్ధి, నాణ్యతను మెరుగుపర్చడంతోపాటు గిరిజనుల ప్రయోజనాలు, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ బోధన, పరిశోధనలను అందిస్తుందని.. ఉన్నత విద్య, ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన మార్గాలను ప్రోత్సహిస్తుందని తెలిపింది. ప్రాంతీయ అసమతుల్యతను తొలగించడానికి తోడ్పడుతుందని వెల్లడించింది. భారీ ఎగుమతులే లక్ష్యంగా.. దేశీయంగా పసుపు పంట, పసుపు ఉత్పత్తుల అభివృద్ధి కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పసుపు వినియోగం పెంచడానికి, అంతర్జాతీయంగా మార్కెట్ అభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని తెలిపింది. దేశంలో 2022–23లో 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేయగా.. 11.61 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపింది. బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేసి యాల్లో భారత పసుపునకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. జాతీయ పసుపు బోర్డుతో 2030 నాటికల్లా రూ.8,400 కోట్ల (బిలియన్ డాలర్ల) విలువైన పసుపు ఎగుమతులను సాధించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ బోర్డుకు చైర్మన్‌ను కేంద్రం నియమిస్తుంది. ఆయుష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, వాణిజ్య, పరిశ్రమల శాఖల నుంచి రొటేషన్ పద్ధతిలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, పరిశోధనల్లో భాగస్వామయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. బోర్డుకు కార్యదర్శిని కేంద్ర వాణిజ్య శాఖ నియమిస్తుంది. -
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ, టీఎస్ మధ్య..
సాక్షి, ఢిల్లీ: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు కేటినెట్ నిర్ణయాలకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. ►ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని KWDT-2ట్రిబ్యునల్ కు కేంద్రం ఆదేశం. ప్రాజెక్ట్‌ల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశం. ► ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీకి ఆమోదం. ► సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. రూ.889 కోట్లో వర్సిటీ ఏర్పాటు. ► తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన మూడు అంశాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కోసం రైతులు చాలా రోజులుగా పోరాటం చేశారు. ఈరోజు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో జరుగుతోంది అని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై పరిష్కారం చేశాం. విభజన చట్టం సెక్షన్-89కి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నాం. ట్రిబ్యునల్ ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులను చేస్తుంది. సొలిసిటర్ జనరల్ సూచనలతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీలు కేటాయించారు. 2013లో ట్రిబ్యునల్ రిపోర్టు వచ్చినా, గెజిట్ కాలేదు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది. తాజాగా నదీ జలాల అంశం పరిష్కారం కానుంది అని అన్నారు. దాదాపు 900 కోట్ల రూపాయలతో ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తాం. తెలంగాణ గిరిజనుల్లో 40 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. గిరిజనుల బాగు కోసమే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన జరుగుతుంది. Government of India has notified the establishment of the National Turmeric Board. This Board will help increase awareness and consumption of turmeric and develop new markets internationally to increase exports. — ANI (@ANI) October 4, 2023 -
పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్..
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 12 ఏళ్ల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు. 2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు. రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 9 సంవత్సరాల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్‌లో పుసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బోర్డు కోసం పలుమార్లు ఉద్యమాలు కూడా జరిగాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
పసుపు బోర్డుతో ప్రయోజనాలెన్నో!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి, ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం, ఇది దేశంలోనే తొలిసారి కావడం విశేషం. దీనిపై నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మంగళవారం మోదీ పాల్గొనే జనగర్జన సభను రైతులు కృతజ్ఞత సభగా మార్చారు. బోర్డు విధివిధానాలు ప్రకటించనున్న ప్రధాని కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని వాణిజ్య, వ్యవసాయ, ఉద్యాన శాఖల కార్యదర్శులు, ఆర్థిక శాఖ సలహాదారు సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్మన్ పరిధిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పసుపు బోర్డుకు ప్రత్యేకంగా సీఈవోని నియమించనున్నారు. మరో 11 మందిని పసుపుబోర్డుకు సభ్యులుగా నియమించనున్నారు. ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇందూరు సభలో ప్రధానమంత్రి ప్రకటించనున్నారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు.. పసుపు బోర్డు ఏర్పాటైతే రైతులకు కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ వరకు లబ్ధి కలుగుతుంది. రైతులకు పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తరువాత అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. తద్వారా కర్క్యుమిన్ శాతం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందుతుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలివస్తాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తదుపరి దశలో ఇక్కడ పసుపు శుద్ధికర్మాగారం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ మార్కెట్‌కు 7.49 లక్షల క్వింటాళ్లు తెలంగాణ వ్యాప్తంగా గత సీజన్లో సుమారు 8.80 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వచ్చింది. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ మార్కెట్‌కు 7.49 లక్షల క్వింటాళ్లు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం పసుపు సాగులో 40% ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కావడం గమనార్హం. తరువాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. 2020లో ఎంపీ అర్వింద్ చొరవతో నిజామాబాద్‌లో ‘సుగంధ ద్రవ్యాల బోర్డు’రీజినల్ ఆఫీస్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రూ.30 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తరువాత కర్క్యుమిన్ అధారిత పసుపు మార్కెటింగ్ కోసం దేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్ మార్కెట్లో 2021లో నాంది పలికారు. పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు. 2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
తెలంగాణకు మోదీ వరాలు.. పసుపు బోర్డు, సమ్మక్క యూనివర్సిటీ
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పలు వరాలను ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అని ప్రసంగించారు. ఈ క్రమంలోనే కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇదే సమయంలో ములుగు జిల్లాలో సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాలుమూరు సభలో రాజకీయాల గురించి మాట్లాడతానని హింట్ ఇచ్చారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నేడు అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు ప్రారంభించుకున్నాం. రోడ్డు, రైలు కనెక్టివిటీతోనే అభివృద్ధి ముడిపడి ఉంది. ర్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదించుకున్నాం. పార్లమెంట్లో నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నాం. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. రవాణా సదుపాయాలు మెరుగవుతాయి అని తెలిపారు. -
ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం!
ఒకవైపు ఇంట్లో ప్రత్యర్థి.. మరోవైపు బయటి ప్రత్యర్థి. నిజామాబాద్ ఎంపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇంటా బయటా ప్రత్యర్థులు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నా ఎంపీ అరవింద్. అదే రేంజ్లో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారాయన. ఇంతకీ నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాల్సిందే.. నిజామాబాద్ నగరంలో హఠాత్తుగా దర్శనమిచ్చిన వెలిసిపోయిన పసుపు కలర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఆయనపై సెటైర్స్ వేసే రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డ్ అంటూ రంగు వెలసిన పసుపు కలర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లన్నింటి దగ్గరా ఈ ఫ్లెక్సీలు దారినపోయే అందరి దృష్టినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వైరల్‌గా మారింది. దాంతో పాటు.. ఆయా గ్రూపుల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన పసుపు బోర్డ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నావళి కాపీనీ.. అలాగే పసుపు బోర్డుపై గతంలో జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వంటివారిచ్చిన హామీలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కాదు కాదు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎంపీ అరవింద్ ఫైట్‌కు బీజం పడినట్లయింది. సీఎం కేసీఆర్‌కు కౌంటర్.. పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎంపీ అరవింద్ కూడా కొద్ది గంటల్లోనే స్పందించారు. అసలు ప్రశ్నలడగడం కూడా చేతకాని వాళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలను అభివర్ణించారాయన. తమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. మేము ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారాయన. మీ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ, రైతు రుణమాఫీ వంటి అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తామని.. ఇకపై మా తడాఖా చూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు అరవింద్. అంతేకాదు... వాళ్ల ప్రశ్నలు తనకే మెప్పు లభించేలా ఉన్నాయని గులాబీ పార్టీ ఎంపీలను ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో స్పైస్ బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. కనీసం లేఖ రాయడం కూడా చేతకాని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. పసుపు కూలీల ధరల పెరుగుదల సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రెండు సవాళ్లు ఇవే.. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ తీర్థం మరోసారి పుచ్చుకున్న 24 గంటల్లోపే.. ఆయనతో పార్టీకి రాజీనామా లేఖను విడుదల చేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. అయితే తన సోదరుడైన సంజయ్‌తో మొదలైన ఇంటి పంచాయితీతో తలబొప్పి కట్టిన క్రమంలో అరవింద్‌కు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి పసుపు బోర్డ్ పేరిట పోరు మొదలవ్వడంతో రెండు సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనడం ఓ సవాల్‌గానే మారింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ .. ఆయనపై అరవింద్ చేసిన కామెంట్స్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా అరవింద్ మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇంతకాలం అరవింద్‌తో అంటీముంటనట్టుగా ఉంటూ ఈ మధ్య ఆయనకు దూరమైన వారంతా బండి సంజయ్ వర్గంలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా అరవింద్‌ను ఎటూ మసలకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఓ ప్రధాన చర్చ. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
రైతులను దగా చేశారు..వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఓట్ల కోసం రైతులను నమ్మించి దగా చేశారంటూ నిజామాబాద్ ఎంపీ డి.అరవింద్‌పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గెలిచిన వెంటనే పసుపు బోర్డు తెస్తానన్న హామీతో బాండ్ పేపరు కూడా రాసిచ్చి, ఆ తర్వాత రైతులను మోసం చేశారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు, సానుభూతిపరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ దేశంలోనే నంబర్ వన్ అని, ప్రతి గడపకు పూసే పసుపు, అందరి నోటిని తీపి చేసే చెరుకు పండించే ప్రాంతం నిజామాబాద్ అని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కశ్మీర్ అయిన ఆదిలాబాద్ జిల్లా.. పచ్చటి అడవులు, కుంటాల జలపాతంతో పర్యాటకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. కానీ జలియన్‌వాలా బాగ్ని తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనసులను రగిలిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భైంసా మతకల్లోలకు కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో ప్రస్తుత పాలకులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు తలమానికం ఆదిలాబాద్‌కు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ తలమానికమని షర్మిల అన్నారు. వైఎస్సార్ హయాంలో మేజర్ ప్రాజెక్టులు పూర్తి చేశారని, ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు మందకొడిగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజన్న సంక్షేమం కోసం నిలబడతానని స్పష్టం చేశారు. అందుకు అందరి సలహాలు, సూచనలు కావాలని కోరారు. షర్మిలకు మద్దతుగా 10 మంది సర్పంచ్‌లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెజ్జింకి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉభయ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాగోబా వంశీయులు, గోండు జాతి ఆదివాసీలు షర్మిలకు మద్దతు పలికారు. తెలంగాణ బిడ్డ షర్మిలమ్మ నాయకత్వంలో పని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నాగోబా ఆలయ కమిటీ చైర్మన్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 10 మంది సర్పంచ్‌లు వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. -
పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్ పడినట్లేనా?!
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పసుపు రైతుల చిరకాల స్వప్నమైన పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్ పడినట్లేననే వాదన వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సహాయ మంత్రి పురుషోత్తం రూపాలలు పసుపు బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పసుపు పంట సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పసుపు సుగంధ ద్రవ్యాల బోర్డులో ఒక భాగమని వెల్లడవుతుంది. కానీ పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ రాజకీయ పక్షాలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చాయి. ఈక్రమంలో కేంద్రం ప్రకటనతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే.. పొగాకు బోర్డు, మిర్చి బోర్డుల తరహాలోనే ³సుపు బోర్డు ఏర్పాటు చేస్తే పంట సాగు విస్తీర్ణంను నియంత్రించడంతో పాటు మినిమం సపోర్టు ప్రైస్(ఎంఎస్పీ)ని ప్రకటించడం లేదా మద్దతు ధరను అమలు చేయడం జరుగుతుంది. అలాగే పసుపు సాగు చేసే రైతులకు మెళుకువలను తెలియజెప్పి నాణ్యమైన పంటను సాగు చేయించడం జరుగుతుంది. పసుపు సాగు మొదలుకొని మార్కెటింగ్ వరకు పసుపు బోర్డు కనుసన్నలలోనే సాగుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు జరిగితే తమకు ఎలాంటి నష్టం కలుగదని పైగా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని రైతులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సాగు అయ్యే పసుపు పంటలో 80 శాతం పసుపు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లోనే సాగు అవుతుంది. అందువల్ల నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా 2019 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు పోటీ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోను ఇక్కడి రైతులు కొందరు పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్‌తో పోటీ చేశారు. పసుపు బోర్డు విషయంలో కేంద్రం స్తబ్దంగా ఉండటం, రైతులు పట్టు వీడకపోవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. బీజేపీ నేతలు వంచించారు పసుపు బోర్డు ఏర్పాటు విషయమై బీజేపీ నేతలు రైతులను వంచించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామ ని పార్లమెంట్ ఎన్నికల్లో హా మీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. పసుపు బోర్డు సాధించేవరకు మేము నిద్రపోం. – పవన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మోర్తాడ్ రైతుల ఆకాంక్షను నెరవేర్చాలి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి. రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. రైతుల ఆశయాలను సాకా రం చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. బీజేపీ నాయకత్వం చొరవ తీసుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేయించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్ పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదు: పురుషోత్తమ్ రూపాలా -
పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే పసుపు సాగు, మార్కెటింగ్‌కు ఉపయోగపడేందుకు నిజామాబాద్‌లో మసాలా బోర్డు డివిజనల్ కార్యాలయాన్ని రీజనల్ కార్యాలయంగా మార్చి ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాలా తెలిపారు. మసాలా బోర్డు పరిధిలో పసుపుతో పాటు మొత్తం 50 పంటలు ఉన్నాయని, నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పసుపు కోసమే ఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ప్రత్యేకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్పైసెస్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పురుషోత్తమ్ రూపాలా ఇచ్చిన సమాధానంతో సభలో కొద్దిసేపు రసాభాస జరిగింది. పేరేదైనా పని జరుగుతోంది కదా అంటూ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రశ్న అడిగిన ఉత్తమ్‌కు రూపాలా ఎదురు ప్రశ్న వేశారు. కాగా, పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన గురించి అడిగితే, మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా స్పైసెస్ బోర్డు గురించి చెబుతున్నారని మంత్రిపై ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, రాంమాధవ్‌లు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పా టు చేస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీ ఇచ్చాక పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఇబ్బందేంటని కేంద్రాన్ని నిలదీశారు. -
కేటీఆర్ కాదు ఈటల సీఎం అవ్వాలి: జీవన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కన్నా ఈటల రాజేందర్‌ను చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘కేటీఆర్ సమర్ధుడే కావొచ్చు.. కానీ కేటీఆర్‌పై విమర్శలు వస్తాయి. అదే ఈటలపై అయితే రావు.. అతడు సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి’’ అని పేర్కొన్నారు. ఈటలకు సీఎం అవకాశం ఇస్తే మంచిదన్నారు. మంత్రి ఈటలపై ప్రశంసలు కురిపించారు. పసుపు బోర్డ్ ఏర్పాటుకు.. పసుపు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం మాజీమంత్రి జీవన్‌రెడ్డి లేఖ రాశారు. క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదని.. ఇప్పుడు తులం బంగారం రూ.50 వేలకు పెరిగిందని.. పసుపు రూ.6 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరిగేదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు 100 రోజుల్లో ఏర్పాటు చేయకుంటే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఎంపీ అరవింద్ ఇప్పుడు స్పందించడేంటని ప్రశ్నించారు. మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయొచ్చని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పసుపు రూ.7 వేలకు క్వింటాలు కొనేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కేంద్రం.. రాష్ట్రం ఒకరిపై ఒకరు నెపం మోపుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన మాట్లాడుతున్న ఏకైక మంత్రి ఈటల అని.. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడంపై జీవన్ రెడ్డి అభినందించారు. -
పసుపు రైతు చుట్టే పాలి‘ట్రిక్స్’
అన్ని పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికే వాడుకుంటున్నాయి. ఫలితంగా ఏళ్లు గడుస్తున్నా పసుపు రైతుకు న్యాయం జరగడం లేదు. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ‘మద్దతు’ కోసం అన్నదాతలు ఏటా ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు. పసుపు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతాంగం తెర తీస్తోంది. దీన్ని అవకాశంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సాక్షి, నిజామాబాద్: పసుపు రైతులు మళ్లీ దగా పడుతున్నారు. ఈసారి కూడా సరైన మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు. మరో పక్షం రోజుల్లో పసుపు సీజను ఊపందుకోనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పారీ్టలు పసుపు రైతుల సమస్యలపై దృష్టి సారించాయి. పసుపుబోర్డు, కనీస మద్దతు ధర విషయంలో ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు అన్ని పక్షాలు ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ బాండ్‌పేపర్‌పై టీఆర్ఎస్.. పసుపుబోర్డుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని టీఆర్ఎస్ మండిపడుతోంది. పసుపుబోర్డు విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఎంపీ అర్వింద్ విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే పసుపుబోర్డు ప్రకటించాలని కోరుతున్నారు. రాష్ట్ర సర్కారు పైకి నెట్టేస్తున్న బీజేపీ పసుపునకు మద్దతు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ ఇప్పిస్తే మద్దతు ధర విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒప్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ప్రకటించారు. మరోవైపు, పసుపుబోర్డుకు మించే స్పైసిస్‌బోర్డు రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెబుతున్నారు. ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్ పసుపు రైతుల సమస్యలపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇప్పటి వరకు పసుపు రైతుల సమస్యలను పెద్దగా పట్టించుకోని ఆ పార్టీ.. ఇప్పుడు పసుపునకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ నెల 30న ఆర్మూర్‌లో ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
పసుపు ధరలపై ‘కరోనా’ కాటు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ప్రాణాంతకమైన ‘కరోనా’వైరస్ ప్రభావం పసుపు ఎగుమతులపై పడింది. చైనాకు ఎగుమతులు నిలిచిపోవడం, దీనికి తోడు దేశీయ మార్కెట్లో పాత నిల్వలు పేరుకుపోవడంతో ఈ సీజన్లో పసుపు ధర పూర్తిగా పతనమైందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడినుంచి పసుపు అత్యధికంగా ఇరాన్ దేశానికి ఎగుమతి అవుతుంది. అలాగే ఐరోపా దేశాలతో పాటు, చైనాకు కూడా పసుపు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా ఇరాన్లో పరిస్థితులు బాగా లేకపోవడం మరో పక్క చైనాలో కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభం కారణంగా ఎగుమతులు పూర్తిగా పడిపోవడంతో దేశీయ మార్కెట్లో ధర తగ్గిపోయిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అన్నదాత కన్నీళ్లు.. పసుపు ధర పతనమై క్వింటాలుకు కనిష్టంగా రూ.3,800 చేరడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు రాక ఊపందుకుంది. జనవరిలో మొత్తం 38 వేల క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా, ఈనెల 25వ తేదీ నుంచి పంట రావ డం మరింతగా పెరుగుతుంది. గతేడాది కంటే క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేయడంతో పసుపు రైతులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పం ట సగటు ధర క్వింటాలుకు 5,500 వరకు పలికింది. గరిష్టంగా రూ.6,718 వరకు కొను గోలు చేసిన వ్యాపారులు, ఇప్పుడు పూర్తిగా ధర తగ్గించడంతో పసుపు రైతులు పరేషా న్లో పడ్డారు. భారీగా పాత నిల్వలు.. పసుపు పాత నిల్వలు కూడా భారీగా పేరుకు పోయాయని వ్యాపారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 25 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు నిల్వలున్నాయని అంచనా వేస్తున్నారు. ఒక్క నిజామాబాద్ మార్కెట్ పరిధిలోనే సుమారు 3 లక్షల క్వింటాళ్ల పసుపు కోల్డ్ స్టోరేజీల్లో ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో గత ఏడాదితోపాటు అంతకు ముందు సీజనుకు సంబంధించిన పసుపు కూడా ఉంటుందని చెబుతున్నారు. ఎగుమతులు తగ్గాయి.. విదేశాలకు పసుపు పంట ఎగుమతి తగ్గింది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. అలాగే అత్యధికంగా కొనుగోలు చేసే ఇరాన్ కూడా సంక్షో భంలో ఉంది. దేశీయ మార్కెట్లోనూ డిమాండ్ తక్కువగా ఉంది. దీంతో ధర పెట్టలేకపోతున్నాము. అలాగే మహారాష్ట్రలో పసు పు విస్తీర్ణం పెరగడంతో పంట ఎక్కువగా వస్తోంది. డిమాండ్, సరఫరాకు తేడా ఉండటంతో ధర తగ్గుతోంది. –కమల్ కిశోర్ ఇనానీ, పసుపు ఎగుమతిదారుడు బతుకు అందేరవుతోంది.. వ్యాపారులు పసుపు ధర పూర్తిగా తగ్గించారు. మంచి రకం పంటను మార్కెట్‌కు తెస్తే క్వింటాలుకు రూ.5,385 ధర పెట్టిండ్రు. ఈ ధరకు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. రెండు ఎకరాల్లో పసుపు వేసుకున్న. ఎరువు, విత్తనం, కూలీ ఖర్చులన్నీ కలిపి పెట్టుబడి రూ.లక్షన్నర దాటింది. పంట అంతా అమ్మినా పెట్టుబడి ఖర్చులు కూడా రాక మా బతుకే అందేరయ్యేట్లుగా ఉంది. – ఇప్పగంగయ్య, పసుపు రైతు, దోంచంద, నిజామాబాద్జిల్లా. కైకిల్లకు చాల్తలేవు.. పసుపు అమ్మితే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులు (కైకిళ్లకు)కు చాలడం లేదు. పసుపు తవ్వకం కోసం కూలీలకు గంట లెక్క చొప్పున చెల్లించాల్సి వస్తుంది. 34 సంచులు తెస్తే బీట్ల రూ.4,426 ధర పెట్టిండ్రు. ఈ ధరకు పంట అమ్మితే నష్టమే. ఇదేం ధర అని వ్యాపారులను అడిగితే గుంజాయిషీలేదని అంటున్నరు. తిరిగి ఇంటికి తీసుకపోలేము.. ఏం చేయాలో అర్థమైతలేదు. – గూడ నర్సారెడ్డి, పసుపురైతు ఇబ్రహీంపట్నం, జగిత్యాల జిల్లా. -
ఎంపీ అరవింద్‌పై పసుపు రైతుల ఆగ్రహం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మర్ పల్లి వేల్పురు మండల కేంద్రంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. అనంతరం మెండోరా మండలం సావేల్, కోడిచర్ల, మెండోరా గ్రామాల్లో పసుపు రైతుల పాదయాత్రతో పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తామని పసుపు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ ఆ మాట నిలబెట్టుకోవాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. చదవండి: టీఆర్ఎస్ హిందువులకు వ్యతిరేకం: అరవింద్ -
పసుపుబోర్డు పంచాయితీ
-
పసుపు బోర్డే పరిష్కారం
సాక్షి, నిజామాబాద్ : కనీస మద్దతు ధర ప్రకటించి పసుపు రైతులను తక్షణం ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన టర్మరిక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ప్రతినిధులు డిమాండ్ చేశారు. పసుపు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ కమిటీ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వాలని తీర్మానించింది. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం కమిటీ తొలి సమావేశం జరిగింది. ప్రస్తుతం పసుపు పంట స్పైసిస్‌బోర్డు పరిధిలో ఉండటంతో కనీస మద్దతు ధర ప్రకటించే పరిస్థితి లేనందున, స్పైసిస్ బోర్డు పరిధిలో నుంచి తొలగించి, ప్రత్యేకంగా పసుపుబోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు డిమాండ్ చేశారు. పసుపులో నాణ్యమైన దిగుబడులు వచ్చే వంగడాలపై పరిశోధనలు జరగాలని కోరారు. కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసింది : ఎంపీ అర్వింద్ ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారమని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఔషధ గుణాలున్న పసుపును స్పైసిస్ (సుంగధ ద్రవ్యాల) బోర్డు పరిధిలోకి తెస్తూ అప్పటి కాంగ్రెస్ సర్కారు చారిత్రక తప్పిదం చేసిందని విమర్శించారు. 1987లో స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. పసుపును వంటకాల్లో వాడుకునేది రుచి కోసం కాదని, బ్యాక్టిరియాలను నిర్మూలించడం కోసమనే అంశాన్ని అప్పట్లో కాంగ్రెస్ గుర్తెరగ లేకపోయిందన్నారు. 1981లో కొబ్బరికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన కాంగ్రెస్, అప్పట్లో పసుపును మాత్రం సుగంధ ద్రవ్యాల బోర్డులో కలిపేస్తూ చేతులు దులుపుకుందని అన్నారు. కేరళ కాంగ్రెస్ నాయకులు కొబ్బరి బోర్డును సాధించుకుంటే., అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు పసుపుబోర్డును సాధించుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. కొబ్బరికి ప్రత్యేక బోర్డు, కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ ఏటా కొబ్బరి ఎగుమతుల విలువ రూ.రెండు వేల కోట్లకు మించడం లేదని, బోర్డు, కనీస మద్దతు ధర లేని పసుపు ఎగుమతులు రూ.1,200 కోట్లుకు మించి ఉంటాయని వివరించారు. క్యాన్సర్, అల్టీమర్స్, టీబీ, వాపులు, మెదడుకు సంబంధించిన అనేక జబ్బులను నయం చేసే గుణాలున్న పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరైన విత్తన సరఫరా లేకపోవడం, రైతులకు అవగాహన కల్పించకపోవడంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయన్నారు. యాంత్రీకరణ, డిమాండ్‌కు తగ్గట్టు పంట సాగు, కర్కుమిన్ పెంచడం, కోల్ స్టోరేజీల సౌకర్యం కల్పించడం వంటి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. సమావేశంలో స్పైసిస్‌బోర్డు డైరెక్టర్ ఏబీ రెమాశ్రీ, బోర్డు మెంబర్ సెక్రటరీ లింగప్ప, డీఏఎస్డీ డైరెక్టర్ హామి చేరియన్, మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ డైరెక్టర్ హల్దాన్కర్, జయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్‌రావు, కర్నాటకకు చెందిన టర్మరిక్ గ్రొవర్స్ సొసైటీ ప్రతినిధి హెచ్ రవికుమార్, మెఘాలయాకు చెందిన స్పైసిస్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధి ట్రినిటీ సైలో, మహారాష్ట్రకు చెందిన ఎగుమతి దారులు భరత్ మస్కాయ్, ఈరోడ్‌కు చెందిన వ్యాపారి సత్యమూర్తి, కమిటీ సభ్యులు గోపాలకృష్ణన్, డి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి ఎస్ నర్సింగ్ దాస్, ఎం వెంకటేశ్వర్లు, బెనర్జీ, కంచన్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం
సాక్షి, బాల్కొండ: గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ నేతల రాతలు మార్చిన పసుపు రైతులు మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డుతో ముందుంటానని మాట ఇచ్చిన నాయకులు ఇప్పుడు మీనమేషాలు లేక్కపెడుతుండంతో రైతులు ఇక వేచి చూడడం తమ వల్ల కాదంటూ పోరుబాటకు సిద్ధపడుతున్నారు. ఈ నెల 15 డెడ్‌లైన్‌తో ఆధికార పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. కనీసం మద్దతు ధర కల్పించర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక పెట్టుబడితో, దీర్ఘకాల పంటగా సాగు చేసే పసుపుకు ఇప్పటికైన మద్దతు ధర దక్కదా? పసుపు బోర్డు ఏర్పాటు కాదా ?అనే అనుమానాలు సామాన్య రైతులను ఇప్పటికి వెంటాడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు పసుపు రైతులు భారీ ఉద్యమం చేపట్టి నేతల తల రాతాలను మార్చారు. కాని పసుపు రైతుల రాత మాత్రం మారలేదు. ధరపై ఇంకా భరోసా లభించలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హమీలిచ్చిన నేతలను నిలదీస్తుమంటున్నారు. జిల్లాలో తల్లిపంటగా భావించి 33 వేల ఎకరాల్లో పసుపును సాగు చేస్తారు. పసుపుకు అధిక పెట్టుబడితో, దీర్ఘకాలిక పంట కావడంతో అన్నదాతల శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయాల పెట్టుబడి అవుతుంది. మంచి దిగుబడి, మార్కెట్లో ఆశించిన ధర పలికితే ఎకరానికి 2.5 లక్షల ఆదాయం వస్తుంది అని రైతులు అంటున్నారు. కాని ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టిన పెట్టుబడి కూడ గిట్టని పరిస్థితి ఉంది. పదిహేనేళ్లుగా పోరాటం పసుపు ప్రత్యేక బోర్డు కోసం, మద్దతు ధర కోసం రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు పదిహేనేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు ఉలుకు, పలుకు లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయిన రైతులు పసుపుకు మద్దతు ధర దక్కేల చూడాలని పోరాటాలను చేస్తునే ఉన్నారు. ఇప్పుడైన కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15 వరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే అందోళనలు తీవ్రతరం చేస్తామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ హయంలో స్వర్ణయుగం పసుపు రైతులకు దివంగత ముఖ్యమంత్రి రాజాశేఖర్‌రెడ్డి హయంలో స్వర్ణయగంగా చెప్పుకోవచ్చు. పసుపును మార్క్‌ఫేడ్ ద్వారా కొనుగోలు చేపించడంతో క్వింటాకు రూ.17వేలు పలికింది. దీంతో పసుపు కోసం పోరాటాలు చేసిన ప్రతి సందర్భంలో రైతులు దివంగత నేతను యాది చేస్తునే ఉంటారు. వైఎస్ హయంలోనే పసుపు రైతులు లాభాలను చూశారు. కాని తరువాత వచ్చిన పాలకులు పసుపు పంటకు క్వింటాళుకు 4 వేల రూపాయాలు సరిపోతుందని నివేదికలు ఇచ్చి పసుపు రైతల నోట్లో మట్టి కొట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని గత లోక్‌సభ ఎన్నికల్లో నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ధర లేక పోతే పంటను సాగు చేసి ఏం లాభం. - బుల్లెట్ రాం రెడ్డి మద్దతు ధర ప్రకటించాలి పసుపు పంటకు క్వింటాకు రూ.15వేల మద్దతు ధరను వెంటనే ప్రకటించాలి. ఎన్నికలకు ముందు అది చేస్తాం.. ఇది చేస్తామని నాయకులు ఇప్పుడు మోసం చేసీ మొఖం చాటేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించకుంటే ఉద్యమం పెద్దగ చేస్తాం. పసుపు రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. - ముస్కు రాజేశ్వర్ -
‘హెక్టారుకు రూ. 50,000 పెట్టుబడి సాయం’
న్యూఢిల్లీ: ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సాహం కోసం హెక్టారుకు రూ. 50,000 పెట్టుబడి సాయం కేంద్రం నుంచి ఉంటుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీ కృషి భవన్లో అగ్రికల్చర్ సెక్రెటరీ ఆధ్వర్యంలో అన్ని స్థాయిల అధికారులతో అరవింద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు పంట.. విత్తనాల నుంచి ఎరువులు, సాగు ఖర్చు, యంత్ర పరికరాల వినియోగం, కూలీల ఖర్చు, దిగుబడి, స్టోరేజ్, మార్కెట్ వ్యవస్థ తోపాటు మార్కెట్లో పంట అమ్మకం వరకు జరిగే ప్రక్రియ గురించి అధికారులు, రైతులతో అరవింద్ కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు పంటకు సంబంధించి అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించామని అరవింద్ వెల్లడించారు. పసుపు పంట ఎగుమతి జిల్లాలు నిజామాబాద్, కరీంనగర్‌లను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న 50 అర్గానిక్ ఫార్మింగ్ క్లస్టర్లలో చేర్చిందని ఆయన తెలిపారు. ఈ క్లస్టర్స్‌లో ఉండటం వల్ల కోల్డ్ స్టోరేజీలకు కావాల్సిన సాయం కూడా అందనుందని పేర్కొన్నారు. అంతే కాకుండా పసుపు పంట కోసం విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కావల్సిన సాయంతో పాటు ట్రైనింగ్, యంత్ర పరికరాల వాడకం, సరఫరా, మార్కెటింగ్ లాంటి అంశాల మీద అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు. పసుపు పంట బరువు తగ్గకుండ కుర్కుమిన్ శాతం పెంచే విధంగా విత్తన సరఫరా కూడా చేస్తున్నామన్నారు. దీంతోపాటు మార్కెటింగ్ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రేడర్స్‌ను నిజామాబాద్‌కు తీసుకువస్తామని.. పంటలో కుర్కుమిన్ శాతం వెంటనే తెలుసుకోవడం కోసం మార్కెట్లోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకుంటామన్నారు. అవసరమైతే దీని కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా పసుపు బోర్డు, మద్దతు ధర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అరవింద్ తెలిపారు. -
పసుపు బోర్డుపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు రాసిన లేఖకు కేంద్ర మంత్రి స్పందించారు. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోరకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. పసుపు పంట మార్కెటింగ్ రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని సురేష్ ప్రభు అన్నారు. స్పైసెస్ బోర్డు పసుపుతో పాటు ఇతర ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెలల్‌ను స్పైసెస్ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం పథకం కింద ప్రత్యేకంగా ఓస్పైసెస్ పార్క్‌ను కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.