![Turmeric Farmers Slams Dharmapuri Arvind In Nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/16/ARVIND-BJP.jpg.webp?itok=bubCx_eg)
ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న పసుపు రైతులు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మర్ పల్లి వేల్పురు మండల కేంద్రంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
అనంతరం మెండోరా మండలం సావేల్, కోడిచర్ల, మెండోరా గ్రామాల్లో పసుపు రైతుల పాదయాత్రతో పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తామని పసుపు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ ఆ మాట నిలబెట్టుకోవాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు.
చదవండి: టీఆర్‌ఎస్ హిందువులకు వ్యతిరేకం: అరవింద్
Comments
Please login to add a commentAdd a comment