బ్రిక్స్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఫోరం శనివారం రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభమైంది.
జైపూర్: బ్రిక్స్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఫోరం శనివారం రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభమైంది. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బ్రిక్స్ సమావేశాన్ని ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల నుంచి 42మంది మహిళా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
బ్రెజిల్ నుంచి ఐదుగురు, రష్యా నుంచి ముగ్గురు, భారత్ నుంచి 28 మంది, చైనా నుంచి ఇద్దరు, సౌతాఫ్రికా నుంచి నలుగురు మహిళా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. నిజామాబాద్ ఎంపీ కవిత, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, సుప్రియా సూలె, వసుంధర రాజె తదితరులు పాల్గొన్నారు.
Meeting of BRICS women parliamentarians' forum in Rajasthan Vidhansabha (Jaipur) pic.twitter.com/N7tl69oodO
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 20 August 2016