
సాయమడిగితే ఎంపీ కవిత తక్షణమే స్పందన
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండగ బతుకమ్మ. అయితే ఆ పండుగ కోసం పండుగ కోసం పూలు కోసి తెచ్చేందుకు వెళ్లిన ప్రయత్నంలో తనకు కరెంట్ షాక్ తగిలిందని.. ఈ ప్రమాదంలో తాను రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు సాయం చేయాలని మంచిర్యాల, నస్పూర్ కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఎస్ శేఖర్ ట్విట్టర్ ద్వారా టీఆర్ఎస్ ఎంపీ కవితను కోరారు. ఈ ఘటన 2014 జనవరి 10వ తేదీన జరిగిందని.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసిన ఎలాంటి సాయం అందలేదని బాధితుడు శేఖర్ ట్విట్లో పేర్కొన్నాడు.
బాధితుడు శేఖర్ ట్వీట్ పై ఎంపీ కవిత వెంటనే స్పందించారు. మీకు తప్పకుండా సహాయం చేస్తామని ఆమె రీట్వీట్ చేశారు. శేఖర్ పూర్తి వివరాలను సంతోష్.జాగృతి@జీమెయిల్.కామ్ కు పంపించాలని ఆమె ట్వీట్ లో సూచించారు. గత కొన్ని రోజుల నుంచి తనకు సాయం చేయాలని శేఖర్ ట్వీట్లు చేస్తుండగా ఎట్టకేలకు అతడికి సాయం అందనుంది. రెండు కాళ్లు కోల్పోయినప్పుడు ట్రీట్ మెంట్ కోసం దాదాపు రూ.18 లక్షలు ఖర్చుపెట్టామని.. ఆర్థికంగా ఆదుకోవాలని ఇటీవల వరుస ట్వీట్లు చేశాడు. ఈసీఈ విభాగంలో బీ.టెక్ పూర్తిచేసిన తనకు వికలాంగుల కోటాలో తన చదువుకు తగ్గ జాబ్ ఇప్పించాలని ఇటీవల టీఆర్ఎస్ నేతలకు మొర పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎంపీ కవిత బాధితుడు శేఖర్ ట్వీట్లపై స్పందించి.. తప్పకుండా సాయం చేస్తామని, వివరాలు తెలపాలని చెప్పారు.
Tappakunda .. pls send me your details on santosh.jagruthi@gmail.com https://t.co/Oz9RzIeeP4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 4 April 2017
@RaoKavitha madam 10.1.14 roju bathukamma flwrs ki velli curent shock valla 2legs poyayi CM fond apply chesam raledu madam plz ippinchandi pic.twitter.com/hfvYh9W3qs
— s shekhar (@shekhar436) 4 April 2017