
తెలంగాణకు ఆయన ఆగర్భ శత్రువు: కవిత
నిజామాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు చంద్రబాబు ఆగర్భ శత్రువని కవిత విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారని మండిపడ్డారు. లోక్సభ, రాజ్యసభలో తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు.
తెలంగాణ ఎంసెట్-2ను రద్దు చేయడంపై కవిత స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్ కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎంసెట్ పరీక్షపై సోమవారం వివరణ ఇస్తారని చెప్పారు.