
మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత
న్యూఢిల్లీ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హాల్లో కలిశారు. తెలంగాణకు చెందిన వివిధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా ప్రధానితో చర్చించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కాగా ఎంపీ కవిత ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రధానితో చర్చించిన అంశాలపై ఆమె ప్రకటన చేయనున్నారు.