హైదరాబాద్ : కేంద్ర కేబినెట్లో చేరేందుకే టీఆర్ఎస్ ఎంపీ కవిత...ప్రధాని మోదీ భజన చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన లబ్ది ఏమిటో టీఆర్ఎస్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారన్నారు.
రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంతమేర న్యాయం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.