నాయుడుపేట(నెల్లూరు జిల్లా): నాయుడు పేట మండలం ఎంపీ చక్కెర కర్మాగారం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆటో అదుపు తప్పి ఢీకొట్టింది.
ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాయుడు పేట నుంచి అపెక్స్ అనే దర్జీ పరిశ్రమకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో అదుపు తప్పి ఢీకొట్టడంతో..
Published Mon, Apr 18 2016 10:30 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement
Advertisement