చాగల్లులో షుగర్ ఫ్యాక్టరీ సీజ్
చాగల్లు (కొవ్వూరు) : చాగల్లులో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రెండేళ్లగా ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా రైతులు తమకు రావలసిన బకాయిల కోసం పోరాటం చేస్తున్నారు. యాజమాన్యం బకాయిలు కొంతమేర చెల్లించినా ఇంకా రూ.19.04 కోట్లు రైతులకు బకాయి పడింది. దీంతో రైతులు రెవిన్యూ అధికారులను ఆశ్రయించడంతో ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీ అస్తులు వేలం వేయటానికి పలు దఫాలు నోటీసులు జారీ చేశారు. ఐదుసార్లు వేలం నిర్వహించినా పాటదారులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. తిరిగి ఈ నెల 23వ తేదీన ఫ్యాక్టరీ అస్తులకు వేలం నిర్వహించనున్నారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో పని చేసే 600 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు.