మొదటి విడత రూ.1800 చెల్లించాల్సిందే!
Published Thu, Jan 16 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
భీమసింగి సుగర్స్ (జామి), న్యూస్‌లైన్:భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిధిలో ని చెరుకు రైతులకు మొదట విడత రూ.1800 చొప్పున బిల్లు చెల్లించాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ కర్మాగారం ఎండీ డి.నారాయణరావును ఆదేశించారు. మంగళవారం ఆయన భీమసింగి చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా రూ.1200 చొప్పున చెల్లించడం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈసారి అలా జరగకుండా మొదటి విడతలో రూ.1800 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. దీనిపై కర్మాగారం ఎండీ డి.నారాయణరావు స్పంది స్తూ.. ప్రస్తుతం తమ వద్ద సొమ్ము లేదని, ఆప్కోబౌ పంచదార క్వింటాకు రూ.2,200 చొప్పున మాత్రమే రుణం ఇస్తున్నారన్నారు. ఆ సొమ్ముతో సి బ్బంది జీతాలు, రైతులకు బిల్లుల చెల్లింపు కష్టమని మంత్రికి వివరించారు. ఆప్కౌబౌ రుణం క్వింటాకు 2,600 చొప్పున వచ్చేలా చూడాలని మంత్రిని కోరా రు. ఈ ఏడాది క్రషింగ్ కనీసం లక్ష టన్నులు కూడా జరిగే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం కర్మాగారానికి రూ.20 కోట్లు రుణం ఇ స్తేగాని కర్మాగారం మనుగడ కష్టమని చెప్పారు. అనం తరం మంత్రి కర్మాగారం స్థితిగతులపై ఆరా తీశారు.
నల్లబుగ్గితో అనారోగ్యం
కర్మాగారం నుంచి వస్తున్న ప్లేయాష్ (నల్ల బుగ్గి ) వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పిడిది రామకృష్ణతో పాటు స్థానికులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ విషయమై మంత్రి, కర్మాగారం ఎండీని ప్రశ్నించగా.. నల్లబుగ్గిని పూర్తిస్థాయిలో నిరోధించాలంటే సుమారు కోటిన్నర వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, సీఈజీఓ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇది రైతు సంఘం మొదటి విజయం
చెరుకు రైతులకు మొదటి విడతగా రూ.1800 చొప్పున బిల్లు చెల్లించడానికి మంత్రి బొత్స, కర్మాగారం ఎండీ అంగీకరించారని రైతు సంఘం అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ఇది రైతు సంఘం మొదటి విజయమన్నారు. చెరుకు రైతుల ఇతర సమస్యలను కూడా మం త్రి దృష్టికి తీసుకువెళ్లామని, దశల వారీగా సమస్యల ను పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలినపారు.
Advertisement
Advertisement