first installment
-
ఒకేసారి అన్నారు.. ఇప్పుడు దశలవారీ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ సొమ్మును ఒకేసారి రైతుల ఖాతాల్లో వేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. దశల వారీగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ తదుపరి విడత ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారీగా రుణమాఫీ చేయడం వలన ఇతర రైతులు ఆ సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కీలకమైన వానాకాలం సీజన్లో రైతులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. లక్షకు పైన ఉంటే ఎదురుచూపులే..! రుణమాఫీని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరో పద్ధతిలో చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రైతుకు లక్షన్నర రూపాయల రుణం ఉంటే... 18వ తేదీన ఆ రైతుకు లక్ష వరకు మాఫీ చేయరు. కేవలం లక్ష రూపాయలలో పు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు. అంటే లక్షకు పైగా రుణాలున్నవారు ఆ తర్వాత ప్రభు త్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురుచూడాల్సిందేనన్న మాట. గతంలో రుణం ఎంతున్నా ప్రభుత్వం నిర్ధారించిన మేరకు అందరికీ రుణమాఫీ జరిగేది. గత ప్రభుత్వం లక్షరూపాయల లోపు రు ణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.ఆ డేటా ఆధారంగానే ఈసారి 18వ తేదీన రైతులకు రుణమాఫీ చేస్తారని అంటున్నారు. మరోవైపు రేషన్ కార్డు వెరిఫికేషన్, పీఎం కిసాన్ నిబంధన ప్రకారం అనర్హులను 18వ తేదీ రుణమాఫీ సందర్భంగా ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. గురువారం ఒక్క రోజులోనే లక్ష లోపు రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం సెలవు అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అ లాగే బ్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. -
ఫిర్యాదుల వెల్లువ
‘రుణమాఫీ ఫిర్యాదులు కర్నూలు జిల్లాలో తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ జిల్లాలో రుణమాఫీ బాగానే జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.’ – ఇవీ సోమవారం రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన అంచనా తప్పని ఒక్కరోజులోనే తేలిపోయింది. తమకు రుణాలు మాఫీ కాలేదని, ఎందరు అధికారులను కలిసినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఫిర్యాదు చేయడానికి వేలాదిమంది రైతులు తరలివచ్చారు. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో రెండోరోజైన మంగళవారం కూడా రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో జెడ్పీ ప్రాంగణం కిటకిటలాడింది. రెండో రోజు దాదాపు ఆరు వేల మంది రైతులు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చారంటే జిల్లాలో రుణమాఫీ ఏ రీతిలో అమలైందో అర్థం చేసుకోవచ్చు. రైతు సాధికార సంస్థ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయంతో 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద రైతులు బారులుతీరారు. అర్ధరాత్రి వరకు ఫిర్యాదుల పరిశీలన కొనసాగింది. ఒక్కో రైతుది ఒక్కో వేదన.. పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఒక్కో రైతుది ఒక్కో వేదనగా ఉంది. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా ఒక్కరూపాయి కూడా మాఫీ కాని రైతులు 50 శాతం మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాని వారు, మొదటి విడత రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యి.. రెండు, మూడు విడతలు రానివారు ఉన్నారు. మాఫీ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు, మూడు విడతల మాఫీ నిధులను సంబంధిత బ్యాంకులకు విడుదల చేశామని, వెళ్లి బ్యాంకులో కలవాలంటూ అధికారులు పాత పాటే పాడారు. పరిష్కార వేదిక పేరిట హడావుడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు రైతుల కోసం ఏదో చేస్తున్నారే అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా దుయ్యబట్టారు. బంగారంపై తీసుకున్న రుణం మాఫీ కాలేదు బంగారంపై రూ.78 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. కానీ మాఫీ కాలేదు. అర్హత ఉన్నందున మాఫీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిర్యాదు చేశా. యథావిధిగా ఎన్ఐసీ పోర్టల్‌లో వివరాలు లేవు. బ్యాంకుకు వెళ్లమని కాగితం చేతిలో పెట్టారు. – బి.గిరప్ప, చాగి, ఆదోని మండలం -
మొదటి విడత రూ.1800 చెల్లించాల్సిందే!
భీమసింగి సుగర్స్ (జామి), న్యూస్‌లైన్:భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిధిలో ని చెరుకు రైతులకు మొదట విడత రూ.1800 చొప్పున బిల్లు చెల్లించాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ కర్మాగారం ఎండీ డి.నారాయణరావును ఆదేశించారు. మంగళవారం ఆయన భీమసింగి చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా రూ.1200 చొప్పున చెల్లించడం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈసారి అలా జరగకుండా మొదటి విడతలో రూ.1800 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. దీనిపై కర్మాగారం ఎండీ డి.నారాయణరావు స్పంది స్తూ.. ప్రస్తుతం తమ వద్ద సొమ్ము లేదని, ఆప్కోబౌ పంచదార క్వింటాకు రూ.2,200 చొప్పున మాత్రమే రుణం ఇస్తున్నారన్నారు. ఆ సొమ్ముతో సి బ్బంది జీతాలు, రైతులకు బిల్లుల చెల్లింపు కష్టమని మంత్రికి వివరించారు. ఆప్కౌబౌ రుణం క్వింటాకు 2,600 చొప్పున వచ్చేలా చూడాలని మంత్రిని కోరా రు. ఈ ఏడాది క్రషింగ్ కనీసం లక్ష టన్నులు కూడా జరిగే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం కర్మాగారానికి రూ.20 కోట్లు రుణం ఇ స్తేగాని కర్మాగారం మనుగడ కష్టమని చెప్పారు. అనం తరం మంత్రి కర్మాగారం స్థితిగతులపై ఆరా తీశారు. నల్లబుగ్గితో అనారోగ్యం కర్మాగారం నుంచి వస్తున్న ప్లేయాష్ (నల్ల బుగ్గి ) వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పిడిది రామకృష్ణతో పాటు స్థానికులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ విషయమై మంత్రి, కర్మాగారం ఎండీని ప్రశ్నించగా.. నల్లబుగ్గిని పూర్తిస్థాయిలో నిరోధించాలంటే సుమారు కోటిన్నర వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, సీఈజీఓ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఇది రైతు సంఘం మొదటి విజయం చెరుకు రైతులకు మొదటి విడతగా రూ.1800 చొప్పున బిల్లు చెల్లించడానికి మంత్రి బొత్స, కర్మాగారం ఎండీ అంగీకరించారని రైతు సంఘం అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ఇది రైతు సంఘం మొదటి విజయమన్నారు. చెరుకు రైతుల ఇతర సమస్యలను కూడా మం త్రి దృష్టికి తీసుకువెళ్లామని, దశల వారీగా సమస్యల ను పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలినపారు.