షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం | fire accident at sugar factory and heavy property loss | Sakshi
Sakshi News home page

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం

Published Sat, Oct 15 2016 7:58 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం - Sakshi

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం

కొత్తకోట: చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ వల్ల వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల శివారులో శ్రీ కృష్ణవేణి చక్కె ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని విద్యుత్ ఉత్పత్తి జరిగే కన్వెరి బెల్ట్‌లో శనివారం షార్ట్‌సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారి వద్ద ఉన్న అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు అదుపుచేయడం ఆలస్యమవడంతో అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సీహెచ్ నాగేశ్వర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement