property loss
-
అకాల వర్షాల బీభత్సం
న్యూఢిల్లీ/జైపూర్/భోపాల్/అహ్మదాబాద్: రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను మంగళవారం రాత్రి భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో కలిపి 53 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడించారు. రాజస్తాన్, గుజరాత్‌ల్లో భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించిందన్నారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. గుజరాత్లో అకాల వర్షాలు, తద్వారా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి గుజరాత్లో మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేíషియా ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు చనిపోతే మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ గురించి మాత్రమే పట్టించుకుంటున్నారనీ, ఆయన దేశానికి ప్రధానా లేక గుజరాత్‌కు మాత్రమేనా అని ప్రశ్నించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేస్తూ మధ్యప్రదేశ్, రాజస్తాన్, మణిపూర్‌ల్లోనూ చనిపోయిన వారి బంధువులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు సాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాజస్తాన్ మరో రూ. 4 లక్షల సాయం.. వర్షాల వల్ల మరణించిన వారి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజస్తాన్ ప్రభుత్వం రూ. 4 లక్షలు, గుజరాత్ ప్రభుత్వం రూ. 2 లక్షల నష్ట పరిహారం ప్రకటించాయి. రాజస్తాన్‌లో పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామనీ, కొన్ని పశువులు కూడా మరణించాయని అధికారులు చెప్పారు. పంట నష్టానికి కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే ఓం బిర్లా డిమాండ్ చేశారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మృతులకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు గుజరాత్లో భారీ వర్షాలకు గాలి దుమారం కూడా తోడైంది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది. హిమ్మత్‌నగర్ పట్టణంలో మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి కూడా దెబ్బతింది. పంట నష్టంపై సర్వే చేసి నిర్ణయం తీసుకుంటామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. ప్రభావిత ప్రాంతాలకు చేతనైన సాయం చేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీనిచ్చారు. 24 గంటల్లో ఉత్తర భారతంలో వర్షాలు.. రానున్న 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం అంచనావేసింది. మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. వాయవ్య భారతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఆ విభాగం పేర్కొంది. వర్షాలపై రాజకీయాలొద్దు: మోదీ వర్షాల కారణంగా నాలుగు రాష్ట్రాల్లో మరణాలు సంభవించినా మోదీ గుజరాత్‌కు మాత్రమే సాయం చేస్తున్నారంటూ కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. అకాల వర్షాలపై రాజకీయాలు చేయవద్దని ఆయన పార్టీలను కోరారు. గుజరాత్‌లోని సబర్‌కాంఠా జిల్లాలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషాద సమయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని నేను పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విషాదంలో ఉన్నవారికి మనం సాయం చేయాలి. వర్షాల వల్ల నష్టపోయిన వారికి సాంత్వన చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి’ అని అన్నారు. అస్సాంలో రైలుపట్టాలపై పడిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు -
కుంగిన బహుళ అంతస్తుల భవనం
కాజీపేట: నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కాజీపేట పట్టణంలోని 35వ డివిజన్ భవానీనగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్–4 భవనం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా భూమిలోకి కనిపించకుండాపోయాయి. దీంతో నాలుగంతస్తుల భవనం కాస్తా రెండంతస్తుల భవనంగా మారిపోయింది. వివరాల ప్రకారం...కొత్త రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి జీ ప్లస్–4 పద్ధతిలో కొత్త ఇంటి నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఏడాది నుంచి పనులు కొనసాగుతున్నాయి. కూలీలు మంగళవారం ఉదయం భవనానికి ప్లాస్టరింగ్ పనులు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. నాణ్యత ప్రమాణాలను పాటించని కారణంగానే భవనం భూమిలోకి కుంగిపోయి ఉంటుందని మేస్త్రీలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేని వానలు కూడా ఓ కారణమని అంటున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.1.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కదిలి వచ్చిన అధికార యంత్రాంగం... భవనం కుంగిపోయిందనే సమాచారంతో జిల్లా అధికార యంత్రాంగం అరగంటలో భవానీనగర్‌కు చేరుకుని వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులు, ఫైర్‌స్టేషన్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐలు శ్రీలక్ష్మి, సంతోష్, అజయ్ పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి స్థానికులెవరినీ భవనం దరిదాపులకు వెళ్లకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. వాచ్‌మన్ ఆచూకీపై అనుమానాలు... ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న వాచ్‌మన్, ఘటన తర్వాత కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళ కావడంతో కుటుంబంతో ఆ భవనంలో నిద్రిస్తున్నాడా.. లేక బయట ఉన్నాడా అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అగ్నిప్రమాదం: రూ.10 లక్షల నష్టం
సాక్షి, అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శివాలయం వద్ద పది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదం జరగడానికి కారణం తెలియరాలేదు. పది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. -
ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదం..భారీ నష్టం
హైదరాబాద్: పాతబస్తీ తలాబ్‌కట్టాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. స్థానిక రోడ్ నంబర్-2 జహంగీర్నగర్లోని షేక్ అన్వర్‌కు చెందిన ఫర్నిచర్ దుకాణంలో అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లిందని యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అగ్నిప్రమాదం: రూ.4 లక్షల ఆస్తి నష్టం
జోగులాంబ గద్వాల: జిల్లాలోని రాజోలి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ మటన్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసింది. రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం
కొత్తకోట: చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ వల్ల వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల శివారులో శ్రీ కృష్ణవేణి చక్కె ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని విద్యుత్ ఉత్పత్తి జరిగే కన్వెరి బెల్ట్‌లో శనివారం షార్ట్‌సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారి వద్ద ఉన్న అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు అదుపుచేయడం ఆలస్యమవడంతో అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సీహెచ్ నాగేశ్వర్రావు తెలిపారు. -
ఇళ్లపై దాడి
మహబూబాబాద్ రూరల్ : అమనగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతికి తమ కులస్తులే కారణమని పలువురు తమ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆస్తి నష్టం చేశారని ఎరుకల కులస్తులు కూజ అనిత, వెంకటమ్మ, మంగమ్మ, చంద్ర మ్మ, చిన్న మంగమ్మ బుధవారం తెలిపారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూజారి వీరన్న ఆగస్టు 12న గ్రామ శివారులో ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడి చికిత్సపొందుతూ అదే నెల 25న మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కారణమంటూ ఆమనగల్‌కు చెందిన బొమ్మెర రామస్వామి 40 మందిని వెంటబెట్టుకుని వచ్చి తమ కులానికి చెందిన ఎనిమిది ఇళ్లపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో తమ ఇళ్ల ధ్వంసమయ్యాయని, బియ్యం, సామాన్లు, బీరువాలు, టీవీలు, ఫర్నీచర్ పనికి రాకుండా పగులగొట్టారని వాపోయారు. తమ కుటుంబ సభ్యులపై కూడా బూతులు తిడుతూ దాడి చేశారన్నారు. పూజారి వీరన్న మృతికి తమ కులస్తులే కారణమంటూ ఇష్టం వచ్చినట్లు దాడి చేయడంతో భయాందోళనకు గురై అమనగల్ విడిచి పారి పోయి మహబూబాబాద్‌కు వచ్చి రూరల్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదుచేశామన్నారు. రూరల్ ఏఎస్సై రాజేందర్, హెడ్‌కానిస్టేబుల్ డీ.మనోహరస్వామి, పోలీసు సిబ్బంది అమనగల్‌లోని ఎరుకల కులస్తుల ఇళ్లు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ఆలమూరు (పెనుమంట్ర): ఆలమూరు శివారు కోమటిచెరువులో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు దగ్ధమైంది. గ్రామ శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఉదయం 10 గంటలకు కొండేటి సూర్యారావు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించి సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు అత్తిలి అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. గ్రామ కార్యదర్శి, వీఆర్వోలు ప్రమాద నష్ట వివరాలను నమోదు చేశారు. -
పిడుగురాళ్లలో భూకంపం
► సెకన్లపాటు కంపించిన భూమి ► ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన జనం పిడుగురాళ్ల : మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీస్తుండగా ఒక్కసారిగా ధభేల్‌మనే శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు రామయ్య... ఇదేం శబ్దమని ఇరుగుపొరుగు వారు కూడా భయంతో గృహాల్లో నుంచి బయటకు పరిగెత్తారు. అందరూ ఒకచోటకు చేరి ఏమైందంటూ చర్చించుకున్నారు. భూకంపం వచ్చిందని ఓ పెద్దాయన చెప్పాడు. దీంతో వామ్మో పిడుగురాళ్లకు భూకంపం వచ్చిందా అంటూ పట్టణవాసులంతా ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డుతో పాటు జానపాడు రోడ్డు, బస్టాండ్ సమీపంలో, పిల్లుట్ల రోడ్డు, శివాలయం బజారు, గంగమ్మగుడి ప్రాంతాలలో పెద్ద శబ్దం వచ్చింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వ్యాపారులు కూడా భూకంప శబ్దంతో దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్దం వచ్చిందే త;్ఛజి; గృహాలు, షాపుల్లోని సామాన్లు కింద పడడం వంటి సంఘటనలు జరగలేదు. మధ్యాహ్నం 3.10 గంటలకు ఒక్క సెకను ఈ ఘటన సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. -
చెరుకు పంట దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని జామి మండలం పావడ గ్రామంలో ఆదివారం చెరుకు పంట అగ్నికి ఆహుతి అయింది. పంట పోలంలోని కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి రాసుకోపోవడంతో మంటలు చెలరేగాయి. సాగు చేసుకుంటున్న10 ఎకరాల చెరుకు పంటకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట.. తమ కళ్ల ముందే బూడిద కావడంతో తట్టుకోలేని రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. -
సీతారాంపురంలో భారీ అగ్నిప్రమాదం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలం సీతారాంపురంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 పశువుల పాకలు, 4 పూరిళ్లు, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో సుమారుగా 50 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిలినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేదల బతుకు బుగ్గి
► సంతజూటూరులో భారీ అగ్ని ప్రమాదం ► 25 గుడిసెలు దగ్ధం ► కట్టుబట్టలతో మిగిలిన బాధితులు ► 20 లక్షల ఆస్తినష్టం బండిఆత్మకూరు: సంతజూటూరు గ్రామంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని బీసీ కాలనీ పేదలు గుడిసెల్లో నివసిస్తున్నారు. వారు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కూలీకి వెళ్లారు. అయితే వీరి గుడిసెలకు సమీపంలో కంప చెట్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన మంట ఎగిసి పూడిగుడిసెలను తాకాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మంటలు మరింత పెరిగాయి. పొలాల్లో ఉన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే అగ్నికి గాలి తోడు కావడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో 25 గుడిసెలు, నాలుగు గడ్డి వాములు బూడిదయ్యాయి. తిండి గింజలు, దుస్తులు, నగదు బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయి. బాధితుడు పిక్కిలి మధుకు చెందిన మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కాలిపోయాయి. వెంకటమ్మ అనే మహిళకు చెందిన రూ.50వేల నగదు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వెంటనే ఆత్మకూరుకు చెందిన అగ్నిమాపకదళ సిబ్బందికి తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తహశీల్దార్ శేషఫణి గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. బండిఆత్మకూరుకు చెందిన రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి, డాక్టర్ షరీఫ్ సంఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. రెడ్‌క్రాస్ తరుపున తమవంతు చేయూతనందిస్తామని తెలిపారు. -
దుద్దుకూరులో భారీ అగ్నిప్రమాదం
దేవరపల్లి( పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో చెరువుగట్టుపై నిర్మించుకున్న 40 పూరిళ్లు అగ్ని శిలల్లో దగ్ధమైనట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందినట్టు సమాచారం. లక్షల రూపాయల్లో భారీగా ఆస్తినష్టం వాటిలినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా కట్టుకున్న గూడు కళ్లముందే బూడిద కావడంతో బాధితులంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
అపార నష్టం
- అంధకారంలో మదనపల్లె - గాలీవాన బీభత్సంతో అపార నష్టం - అంధకారంలో పట్టణం - రూ.3కోట్లకు పైగా ఆస్తి నష్టం మదనపల్లె: గాలీవాన బీభత్సంతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మంగళవారం రాత్రి గాలీవాన విధ్వంసంతో పట్టణంలో అపార నష్టం వాటిల్లింది. 20ఏళ్ల లోపు ఇంతటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ నెలకొనలేదు. మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. మంగళవారం నాటి గాలీవానకు పట్టణంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు నేల కూలాయి. పెద్ద పెద్ద భవంతులు దెబ్బతిన్నాయి. మదనపల్లె-తిరుపతి ప్రధాన రహదారిలోని తట్టివారిపల్లె వద్ద భారీ మర్రిచెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, సబ్‌కలెక్టర్ మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, పలువురు కౌన్సిలర్లు వర్ష బీభత్స ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలుముకున్న అంధకారం గాలీవాన కారణంగా ట్రాన్స్‌కో శాఖాధికారులు విద్యుత్ నిలిపి వేయడంతో మంగళవారం రాత్రి పట్టణంలో పూర్తిగా అంధకారం నెలకొంది. బుధవారం సా యంత్రం వరకూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ట్రాన్స్‌కో అధికారుల విద్యుత్ సరఫరాను ఆపివేయడం తో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. బుధవారం మున్సిపల్ సిబ్బంది ఆయా ప్రాంతాలో నేల కూలిన చెట్లను తొలగించారు. రావుకుప్పంలో: వుండలంలో వుంగళవారం రాత్రి గాలీవానకు అపారనష్టం వాటిల్లింది. విద్యత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. టమాట, బీన్స్, అరటి పంటలు ధ్వంసమయ్యాయి. మామిడి పంట దెబ్బతినింది. రేకుల ఇళ్లు, పూరి గుడిసెలు కూప్పకూలాయి. తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించండి చిత్తూరు (సెంట్రల్): 24 గంటల్లో మదనపల్లె పట్టణానికి తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి పరిస్థితిని చక్కదిద్దాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో మ దనపల్లె పరిస్థితిపై సమీక్షించారు. ప్రజలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో 250 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, పెద్ద సంఖ్యలో చెట్లు నెలకొరిగాయని తెలి పారు. 150 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వి వరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ మల్లికార్జున్, అధికారులు విజయభాస్కర్, పాండురంగన్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంతో పశువుల పాకలు దగ్ధం
విజయనగరం: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి నాలుగు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా టెర్లాం మండలం చుక్కవలస గ్రామంలో ఆదివారం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి నాలుగు పశువుల పాకలు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 70 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. (టెర్లాం) -
షార్ట్ సర్క్యూట్ తో దుకాణం దగ్ధం
కుల్కచర్ల, న్యూస్‌లైన్: షార్టసర్క్యూట్తో ఓ కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని అంతారం గేటు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన కాంగారు వెంకటయ్య అంతారం గేటు వద్ద కిరాణం, బట్టలు,బ్యాంగిల్స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి పక్కనే ఉన్న ఇంట్లో పడుకున్నారు. అర్ధరాత్రి తరువాత దుకాణంలో నుంచి మం టలు రావడం గమనించారు. దుకాణం తెరిచి చూడగా అప్పటికే అంతా కాలి బూడిదైంది. దుకాణంలో ఉన్న కిరాణ సరుకులు, బట్టలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.లక్ష ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. షార్టసర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.