షార్ట్ సర్క్యూట్ తో దుకాణం దగ్ధం | shop burned with short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్ తో దుకాణం దగ్ధం

Published Wed, Nov 20 2013 1:07 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

shop burned with short circuit

కుల్కచర్ల, న్యూస్‌లైన్:  షార్‌‌టసర్క్యూట్‌తో ఓ కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని అంతారం గేటు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన కాంగారు వెంకటయ్య అంతారం గేటు వద్ద కిరాణం, బట్టలు,బ్యాంగిల్‌స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి పక్కనే ఉన్న ఇంట్లో పడుకున్నారు. అర్ధరాత్రి తరువాత దుకాణంలో నుంచి మం టలు రావడం గమనించారు. దుకాణం తెరిచి చూడగా అప్పటికే అంతా కాలి బూడిదైంది. దుకాణంలో ఉన్న కిరాణ సరుకులు, బట్టలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.లక్ష ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. షార్‌‌టసర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement