- అంధకారంలో మదనపల్లె
- గాలీవాన బీభత్సంతో అపార నష్టం
- అంధకారంలో పట్టణం
- రూ.3కోట్లకు పైగా ఆస్తి నష్టం
మదనపల్లె: గాలీవాన బీభత్సంతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మంగళవారం రాత్రి గాలీవాన విధ్వంసంతో పట్టణంలో అపార నష్టం వాటిల్లింది. 20ఏళ్ల లోపు ఇంతటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ నెలకొనలేదు. మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. మంగళవారం నాటి గాలీవానకు పట్టణంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, పదుల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు నేల కూలాయి. పెద్ద పెద్ద భవంతులు దెబ్బతిన్నాయి. మదనపల్లె-తిరుపతి ప్రధాన రహదారిలోని తట్టివారిపల్లె వద్ద భారీ మర్రిచెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, సబ్‌కలెక్టర్ మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, పలువురు కౌన్సిలర్లు వర్ష బీభత్స ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
అలుముకున్న అంధకారం
గాలీవాన కారణంగా ట్రాన్స్‌కో శాఖాధికారులు విద్యుత్ నిలిపి వేయడంతో మంగళవారం రాత్రి పట్టణంలో పూర్తిగా అంధకారం నెలకొంది. బుధవారం సా యంత్రం వరకూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ట్రాన్స్‌కో అధికారుల విద్యుత్ సరఫరాను ఆపివేయడం తో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. బుధవారం మున్సిపల్ సిబ్బంది ఆయా ప్రాంతాలో నేల కూలిన చెట్లను తొలగించారు.
రావుకుప్పంలో: వుండలంలో వుంగళవారం రాత్రి గాలీవానకు అపారనష్టం వాటిల్లింది. విద్యత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. టమాట, బీన్స్, అరటి పంటలు ధ్వంసమయ్యాయి. మామిడి పంట దెబ్బతినింది. రేకుల ఇళ్లు, పూరి గుడిసెలు కూప్పకూలాయి.
తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించండి
చిత్తూరు (సెంట్రల్): 24 గంటల్లో మదనపల్లె పట్టణానికి తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి పరిస్థితిని చక్కదిద్దాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో మ దనపల్లె పరిస్థితిపై సమీక్షించారు. ప్రజలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో 250 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, పెద్ద సంఖ్యలో చెట్లు నెలకొరిగాయని తెలి పారు. 150 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వి వరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ మల్లికార్జున్, అధికారులు విజయభాస్కర్, పాండురంగన్ పాల్గొన్నారు.
అపార నష్టం
Published Thu, May 21 2015 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement