galivana devastation
-
అపార నష్టం
- అంధకారంలో మదనపల్లె - గాలీవాన బీభత్సంతో అపార నష్టం - అంధకారంలో పట్టణం - రూ.3కోట్లకు పైగా ఆస్తి నష్టం మదనపల్లె: గాలీవాన బీభత్సంతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మంగళవారం రాత్రి గాలీవాన విధ్వంసంతో పట్టణంలో అపార నష్టం వాటిల్లింది. 20ఏళ్ల లోపు ఇంతటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ నెలకొనలేదు. మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. మంగళవారం నాటి గాలీవానకు పట్టణంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు నేల కూలాయి. పెద్ద పెద్ద భవంతులు దెబ్బతిన్నాయి. మదనపల్లె-తిరుపతి ప్రధాన రహదారిలోని తట్టివారిపల్లె వద్ద భారీ మర్రిచెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, సబ్‌కలెక్టర్ మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, పలువురు కౌన్సిలర్లు వర్ష బీభత్స ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలుముకున్న అంధకారం గాలీవాన కారణంగా ట్రాన్స్‌కో శాఖాధికారులు విద్యుత్ నిలిపి వేయడంతో మంగళవారం రాత్రి పట్టణంలో పూర్తిగా అంధకారం నెలకొంది. బుధవారం సా యంత్రం వరకూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ట్రాన్స్‌కో అధికారుల విద్యుత్ సరఫరాను ఆపివేయడం తో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. బుధవారం మున్సిపల్ సిబ్బంది ఆయా ప్రాంతాలో నేల కూలిన చెట్లను తొలగించారు. రావుకుప్పంలో: వుండలంలో వుంగళవారం రాత్రి గాలీవానకు అపారనష్టం వాటిల్లింది. విద్యత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. టమాట, బీన్స్, అరటి పంటలు ధ్వంసమయ్యాయి. మామిడి పంట దెబ్బతినింది. రేకుల ఇళ్లు, పూరి గుడిసెలు కూప్పకూలాయి. తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించండి చిత్తూరు (సెంట్రల్): 24 గంటల్లో మదనపల్లె పట్టణానికి తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి పరిస్థితిని చక్కదిద్దాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో మ దనపల్లె పరిస్థితిపై సమీక్షించారు. ప్రజలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో 250 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, పెద్ద సంఖ్యలో చెట్లు నెలకొరిగాయని తెలి పారు. 150 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వి వరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ మల్లికార్జున్, అధికారులు విజయభాస్కర్, పాండురంగన్ పాల్గొన్నారు. -
పిడుగుల వాన
పడమటి మండలాల్లో గాలీవాన బీభత్సం పిడుగుపడి మహిళ మృతి చెట్టు కూలి మరో యువకుడి మృతి నేలకొరిగిన భారీ వృక్షాలు రహదారుల్లో నిలిచిపోయిన రాకపోకలు సాక్షి, తిరుపతి: జిల్లాలోని పడమటి మండలాల్లో సోమవారం సాయంత్రం పెనుగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. పూతలపట్టు మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. పుంగనూరు మండలంలో చెట్టుకొమ్మ కూలి ఓ యువకుడు చనిపోయాడు. బావిలో పడి ఒక ఎద్దు చనిపోయింది. చౌడేపల్లెలో పిడుగుపాటు కు మరో ఎద్దు మృతిచెందింది. చంద్రగిరి రహదారిలో భారీ చింతచెట్టు నేలకొరిగి ఓ కారు ధ్వంసమైంది. ముగ్గురు గాయపడ్డారు. రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాల్మీకిపురం శివార్లలోని వ్యవసాయ భూముల్లో సోమవారం సాయంత్రం రెండు పిడుగులు పడడంతో కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. సమీపంలో కట్టేసి ఉన్న ఆవులు పిడుగుల శబ్దానికి తాళ్లు తెంపుకుని పరుగులు తీశాయి. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సోమవారం సాయంత్రం హోరు గాలితో కూడిన వాన కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేని గాలులతో కూడిన వర్షం కురిసింది. పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంలో నాగరాజు(23) అనే యువకుడిపై చింతచెట్టుకొమ్మ విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళ ం గ్రామంలో శంకరమ్మకు చెందిన ఎద్దు ఉరుములు, మెరుపులకు పరుగులుతీసి బావిలో పడి మృతి చెందింది. చౌడేపల్లె మండలం మల్లెలవారిపల్లెలో పిడుగుపడి ఒక ఎద్దు మృతి చెందింది. మామిడి, టమోటా పంటలకు నష్టం వాటిల్లింది. పూతలపట్టు మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచాయి. తలపులపల్లె పంచాయతీ అలగానిపల్లెలో పిడుగుపడడంతో సంపూర్ణమ్మ(45) అనే గొర్రెల కాపరి మృతి చెందింది. బి.కొత్తకోట మండలంలోని సుంకరవారిపల్లెలో సోమవారం సాయంత్రం పిడుగుకుపాటుకు ఒక పూరిల్లు దగ్ధమైంది. చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లె సమీపంలో భారీ చింతచెట్టు ఒక్కసారిగా నేలకూలింది. అదే సమయంలో చెట్టు కింద ఉన్న షిప్ట్ కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుడిపాల మండలంలో గాలి, వాన బీభత్సానికి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది. నరహరిపేట, గుడిపాల క్రాస్‌లోని జాతీయరహదారి పక్కన ఉన్న పెద్దవృక్షాలు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు రెండుగంటలకు పైగా తీవ్ర అంతరాయం కలిగింది. వెదురుకుప్పం మండలంలో ఈదురు గాలులకు ఒక రేకుల ఇల్లు ధ్వంసమైంది. శాంతిపురం మండలంలో వడగళ్ల వాన కురిసింది. పెనుగాలుల కారణంగా వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దపంజాణి మండలంలో కుండపోత వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. మదనపల్లె పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. -
పెనుగాలి బీభత్సం
కలికిరిలో పిడుగుపాటుకు ఒకరి మృతి పుత్తూరు మండలంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు విద్యుత్ సరఫరా లేక 14 పంచాయతీల్లో అంధకారం జిల్లాలోని పుత్తూరు, కలికిరి, నగరి, విజయపురం, వడమాలపేట మండలాల్లో గురువారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. అరగంట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కలికిరి శివారు ప్రాంతంలో పిడుగుపడి ఒకరు మృతి చెందాడు. పుత్తూరు మండలంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి. పుత్తూరురూరల్, న్యూస్‌లైన్: పుత్తూరు మండలంలో గురువారం గాలీవాన బీభత్సం సృష్టించింది. గాలి తీవ్రతకు మండల పరిధిలోని దాదాపు 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు పెద్ద మొత్తంలో నేలరాలాయి. మండలంలో సాయంత్రం 5 నుంచి 6.30గంటల వరకు గాలితో కూడిన వర్షం కురిసింది. గాలి ఎక్కువగా ఉండడంతో పున్నమి హోటల్ వద్దనున్న రాచపాళెం దళితవాడలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. పట్టణ సమీపంలోని శిరుగురాచపాళెం వద్దనున్న పెట్రోల్ బంకుపై రేకులు గాలికి ఎగిరిపోయాయి. అదే సమయంలో అక్కడ పెట్రోల్ కోసం వేచి ఉన్న పుత్తూరు సమీపంలోని నెత్తం గ్రామానికి చెందిన సురేష్, పూజితపై రేకులు పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండల పరిధిలోని 14 పంచాయతీల్లో మామిడి చెట్లు నేలకొరిగాయి. మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఇటుక బట్టీల్లో తయారు చేస్తున్న ఇటుకలు పూర్తిగా నానిపోవడంతో నష్టం వాటిల్లింది. 14 పంచాయతీల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా లేక రాత్రంతా ప్రజలు అంధకారంలో ఇబ్బందిపడాల్సి వచ్చింది. విజయపురం, వడమాలపేట మండలాల్లోనూ గాలీవాన కారణంగా మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.