చెరుకు పంట దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని జామి మండలం పావడ గ్రామంలో ఆదివారం చెరుకు పంట అగ్నికి ఆహుతి అయింది. పంట పోలంలోని కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి రాసుకోపోవడంతో మంటలు చెలరేగాయి. సాగు చేసుకుంటున్న10 ఎకరాల చెరుకు పంటకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది.
దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట.. తమ కళ్ల ముందే బూడిద కావడంతో తట్టుకోలేని రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.