![Four Died Due To Electric Shock At Annamayya District - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/14/current-shock.jpg.webp?itok=sw61EpDk)
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గృహప్రవేశం కార్యక్రమంలో ఇంటికి వచ్చిన బంధువులపై కరెంట్ తీగలు తెగిపడటంతో నలుగురు మృతిచెందారు. దీంతో, వేడుక జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లెలో గృహప్రవేశం జరిగిన ఇంట విషాదం నెలకొంది. ఓ ఇళ్లు గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి కరెంట్ తీగలపై పడింది. దీంతో, ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి.. అక్కడున్న వారిపై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గాయపడటంతో వారిని వెంటనే బి.కొత్తకోట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కాగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వేడుక జరుగుతున్న ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు.
మృతుల వివరాలు ఇవే..
1. లక్ష్మమ్మ 75,
2.ప్రశాంత్ 26,
3. లక్ష్మన్న 53,
4. శాంతమ్మ 48.
Comments
Please login to add a commentAdd a comment