ఉద్యోగాల పేరిట టోకరా .. | one person fraud to the unemployed peoples | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట టోకరా ..

Published Sun, Apr 2 2017 8:44 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

one person fraud to the unemployed peoples

చిత్తూరు: ప్రైవేటు ఎగుమతుల కంపెనీల్లో ఉద్యోగాలిపిస్తామంటూ 57 మందికి ఓ వ్యక్తి టోకరాపెట్టాడు. బాధితులంతా జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌కు మొరపెట్టుకోవడంతో వన్‌ టౌన్‌ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. బాధితుల కథనం మేరకు చిత్తూరు నగరంలోని షుగర్‌ ఫ్యాక్టరికీ  సమీపంలో ఓ ఎగుమతుల కంపెనీకి సంబంధించిన కార్యాలయముంది. పదోతరగతి నుంచి డిగ్రీ చదివిన యువకులకు ప్రైవేటు ఉద్యోగాలిపిస్తామంటూ నిర్వాహకుడు ఒక్కొక్కరి నుంచి  రూ.17 వేలు వసూళ్లు చేశాడు.

 ఇలా 57 మంది నుంచి రూ. 9.69  లక్షలు వసూళ్లు చేశాడు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు విచారించగా బోర్డు తిప్పేసి ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకున్నారు.  దీంతో బాధితులంతా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement