నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు సోమవారం బోధన్ బంద్ జరుగుతోంది.
బోధన్(నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు సోమవారం బోధన్ బంద్ జరుగుతోంది. పట్టణంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు.
ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కాంగ్రెస్, శివసేన, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారు.