- రూ.20 వేలు దండుకుని ఇళ్లున్న వారికే ఇళ్లు
- జనచైతన్య యాత్రలో గోరంట్లను నిలదీసిన మహిళ
- ఎక్కువ మాట్లాడితే ఏ పథకమూ రాదని బెదిరించిన ఎమ్మెల్యే
తెగనమ్ముకున్నారు.. దగా చేశారు
Published Sat, Nov 26 2016 12:44 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
‘20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇళ్ల కోసం ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం. ఇప్పటి వరకూ రాలేదు. ఇళ్లు ఉన్నవారికే ఇళ్లు ఇచ్చారు. ఒక్కొక్కరి వద్దా రూ.20 వేలు తీసుకున్నారు. అర్హులమైన మాకు అన్యాయం చేశారు’ అంటూ ఓ మహిళ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నిలదీశారు. టీడీపీ జనచైతన్య యాత్రల్లో భాగంగా ఎమ్మెల్యే గోరంట్ల శుక్రవారం 20వ డివిజ¯ŒS ఆల్కాట్‌తోటలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించిన గోరంట్ల అనుచరులతో సందుగొందుల్లో నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎమ్మెల్యేకు ఎదురుగా వచ్చి 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టినా ఇళ్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న వారి వద్ద డబ్బులు తీసుకుని ఇళ్లు ఇచ్చారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన హయాంలో 30 వేల ఇళ్లు నిర్మించానని గోరంట్ల చెప్పబోతుండగా అడ్డుకున్న ఆ మహిâ¶ళ అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీంతో రెచ్చిపోయిన గోరంట్ల ‘ఎక్కువగా మాట్లాడితే భవిష్యత్‌లో ఏ ప్రభుత్వ పథకాలూ రావు. చదువుకున్నదానివి పద్ధతిగా మాట్లాడు. అనర్హులు ఎవరో చెప్పు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెవరో అందరికీ తెలుసని, మీరు తెలుసుకోవాలంటే ఆధార్, విద్యుత్ బిల్లులు పరిశీలించవచ్చని ఆ మహిళ సమాధానమిచ్చారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వృద్ధురాలు తాను టీడీపీకే ఓటు వేశానని, ఇల్లు వచ్చిందంటూ చెప్పి తనతో డ్యాన్సులు చేయించి, ఫొటోలు కూడా తీశారని, కానీ ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన ఎమ్మెల్యే త్వరలో మరో మూడువేల ఇళ్లు వస్తున్నాయని, వాటిలో ఇస్తానంటూ యాత్రను ముగించారు. రెండు నెలల నుంచి రేష¯ŒS దూరప్రాంతం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. డివిజ¯ŒSలోని డ్రైనేజీల్లో సిల్ట్‌ను తరచూ తొలగించక మురుగు రోడ్లపై పారుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
Advertisement
Advertisement