సాక్షి హైదరాబాద్: ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి సీఎం కేసీఆర్‌లో కనపడటం లేదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా సీఎం కేసీ ఆర్ అసెంబ్లీలో, పలు సభల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నోసార్లు ప్రకటించారని శనివారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు లక్షకు పైనే ఉన్నాయని.. వీటితో పాటు ఈ నాలుగేళ్లలో సుమారు 50 వేల మంది ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందారని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తక్షణమే 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గట్టు డిమాండ్ చేశారు. నాలుగేళ్లు పూర్తయినా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనందుకు నిరసనగా 25న మండల కేంద్రాల్లో ధర్నాలు చేశామన్నారు.
దీనిపై స్పందన రాకపోవడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేం దుకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 2న అన్ని జిల్లా కేంద్రా ల్లోని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు గట్టు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment