ప్రజల్లో ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం | Gattu direction | Sakshi
Sakshi News home page

ప్రజల్లో ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం

Published Thu, Jul 21 2016 4:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

ప్రజల్లో ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం - Sakshi

ప్రజల్లో ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం

- వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గట్టు దిశానిర్దేశం
- ముగిసిన జిల్లాల సమీక్ష సమావేశాలు
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారికి అండగా నిలిచి పరిష్కారాల కోసం కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు, రైతులకు  భరోసా కల్పించాల్సిన సమయమిదేనని అన్నారు. బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో ఖమ్మం, మెదక్ జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తున్నాయని, కానీ, అవి ఒక్క కొత్త పథకాన్ని కూడా తీసుకురాలేక పోతున్నాయని విమర్శించారు.

సెప్టెంబర్ 2న జరిగే వైఎస్సార్ వర్ధంతిపై ఇప్పటి నుంచి ప్రణాళికలు తయారు చేసుకోవాలని, అన్ని చోట్ల వర్ధంతి సభలు జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసిన తర్వాత విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా, మండలంలో పార్టీ అనుబంధ సంస్థల కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, మతిన్, సేవాదశ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు సుధాకర్, ఐటీ విభాగం అధ్యక్షుడు బి. శ్రీవర్ధన్ రెడ్డి, పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకులు ఎం.జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 విజయవంతంగా ముగిసిన సమావేశాలు
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది జిల్లాల విస్తృత స్థాయి సమీక్ష సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర నాయకత్వం కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది. 250 మండలాల కమిటీలు ఏర్పాటు చేసినందుకు పలువురు నాయకులను అభినందించారు.  ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక మంది నాయకులు సమీక్షలో పాల్గొనటం విశేషం. పార్టీని గ్రామ స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా నాయకత్వం దృష్టికి తీసుకవచ్చి, రాష్ట్ర నాయకుల సలహాలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement