
ప్లీనరీపై 10న సన్నాహక సమావేశం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జూలై 8న విజయవాడ వేదికగా వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జూలై 8న విజయవాడ వేదికగా వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సన్నాహక సమావేశాన్ని 10వ తేదీన లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సన్నాహక సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే హాజరుకావాలన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.