
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఆయ న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రక్తదానం, అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర జనవరి 9,10 తేదీల్లో విజయవం తంగా పూర్తి చేసుకోవాలని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి సీఎం కావాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment