grand celebrations
-
నారాయణగూడలో ఘనంగా సదర్ పండుగ వేడుకలు (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు... రష్మిక, విజయ్ దేవరకొండ సహా! (ఫొటోలు)
-
Saddula Bathukamma: తెలంగాణలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు (ఫోటోలు)
-
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
విశాఖలో ఘనంగా వినాయక చవితి సంబురాలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
-
ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ..అమరవీరులకు నివాళులతో మొదలుజూన్ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..2న సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్బండ్ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లుతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఉన్నాయి. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు...ఇంకా ఇతర అప్డేట్స్
-
రంజాన్ పర్వదినం.. అలీ దంపతుల ఆహ్వానం వీరికే! (ఫొటోలు)
-
పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ( ఫొటోలు)
-
సియాటెల్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
ఐదు నెలల్లో టీడీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్!
సాక్షి, నెల్లూరు: ‘వచ్చే నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయ్, మన నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. దీనికి పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాల’ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం (రేపు) వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు వేడుకలను మనం జరుపుకొంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, చంద్రబాబులాగా పొత్తులకు వెంపర్లాడబోదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి.. పచ్చజెండా కట్టాలంటే టీడీపీ నాయకులు భయపడేలా మన ప్రభుత్వం తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఐదు నెలల్లో టీడీపీ నేతలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందని అన్నారు. -
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఆయ న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రక్తదానం, అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర జనవరి 9,10 తేదీల్లో విజయవం తంగా పూర్తి చేసుకోవాలని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి సీఎం కావాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించాలన్నారు. -
ప్రగతి భవన్లో ఉగాది వేడుకలు
-
దేవిని గడప కడపలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
గుంటూరులో ఘనంగా చవితి వేడుకలు
-
సాయి స్మరణం
-
ఘనంగా గణతంత్ర వేడుక
నిజామాబాద్‌కల్చరల్ న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రద్యుమ్న జెండా ఎగురవేశారు. అనంతరం స్వా తంత్య్ర స్ఫూర్తి, దేశభక్తి, సామాజిక అంశాల మేళవింపుతో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ కట్టిపడేశాయి. ఉపాధ్యాయురాలు కళాలలిత వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి. జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, డీఐజీ అనిల్‌కుమార్, ఎస్పీ తరుణ్‌జోషి, వివిధ శాఖాధికారులు, పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు వీక్షించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్య గీతాలు ఆకట్టుకున్నాయి. జిల్లాకేంద్రంలోని రామకృష్ణ విద్యాలయం, వాసవి, ఆర్చిడ్, ఆర్.బి.విఆర్.ఆర్, బ్లూమింగ్‌బర్డ్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు ధర్మారం సాంఘిక సంక్షేమ పాఠశాల, సుద్దపల్లి సాం ఘిక పాఠశాల, ముబారక్‌నగర్ విజయహైస్కూల్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలతో అలరించారు. కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్నారు. శకటాల ప్రదర్శన జిల్లా చరిత్రలో మొదటిసారిగా 17శాఖల శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లానీటి యాజమాన్య సంస్థ, జిల్లాగ్రామీణాభివృద్ధి-క్రాంతి పథకం, జిల్లా గృహనిర్మాణ సంస్థ, 207 వజ్ర, అగ్నిమాపక, 108, జిల్లా వైద్యఆరోగ్య, పశుసంవర్ధక, గ్రామీణనీటి సరఫరా, జిల్లాపౌర సరఫరాల, నగరపాలక, మీసేవా, పర్యాటక, రాజీవ్ విద్యామిషన్ తదితర శాఖలు తమ పోటాపోటీగా తమ శకటాలను ప్రదర్శించాయి. గృహనిర్మాణ సంస్థ రూపొందించిన శకటాన్ని, నగరపాలక సంస్థ శకటాలను కలెక్టర్, ఎస్పీ, ఆయా శాఖాధికారులను అభినందించారు. -
అంతా కరుణామయం
గాంధీనగర్, (కాకినాడ) న్యూస్‌లైన్ :జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, జగ్గంపేట, తుని, కొత్తపేట, పిఠాపురంలలో రొమన్కేథలిక్, లూథరన్, మన్నా, దేవదా సు, బాప్టిస్టు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వృద్ధులకు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కాకినాడ సిటీలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో పాస్టర్ విజయ్‌కుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. వైఎస్సార్ సీపీ సిటీ కో-ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రెగ్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ బాబూరావు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ బాప్టిస్ట్ చర్చిలో గొల్లప్రోలు క్రీస్తుసంఘ సువార్తీకులు ఎం.శామ్యూల్జోయల్ రాజు ప్రత్యేక సందేశాన్ని అందించారు. పిఠాపురం సెం టినరీ బాప్టిస్టు చర్చి, బెతస్థ బాప్టిస్టు చర్చిలలో వేడులకు ఘనం గా జరిగాయి. రాజమండ్రి సెయింట్‌పాల్స్ లూథరిన్ చర్చి, దేవదాసు చర్చి, సెయింట్‌పాల్స్ ఈస్ట్ ప్యారిస్ చర్చి, సెయింట్థామస్ చర్చిలలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగిన వేడుకల్లో జైళ్ల శాఖ కోస్తా రీజియన్ డీఐజీ ఎ.నరసింహ పాల్గొన్నారు. అమలాపురం మన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వేడుకలు జరి గాయి. పాస్టర్ కారల్ డేవిడ్సన్ కొమనాపల్లి క్రీస్తు సందేశాన్ని అందించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు, పార్టీ మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి చర్చిలను సందర్శించి శుభాకాంక్షలు తెలి పారు. కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి నియోజకవర్గంలో పలు చర్చిలకు కేకులు బహుకరించారు. తుని సెయింట్ ఇమ్మానుయేలు బాప్టిస్టు చర్చిలో వేడుకలు నిర్వహించారు. కాకినాడ రూరల్ కరపలో వైఎస్సార్ సీపీ రూరల్ కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పలు చర్చిలను సందర్శించారు. కాకినాడ రేచర్లపేటలోని శాంతి సంఘం చర్చిలో నగర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ రాజారావు ప్రార్థనలు నిర్వహించారు. -
ఘనంగా దీపావళి
ముంబై: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని ముంబై వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వ్యాపారులంతా లక్ష్మీపూజలు నిర్వహించడం కనిపించింది. రాముడు లంకాధీశుడు రావణాసురుడిపై విజయం సాధించి సతీసమేతంగా రాజ్యానికి తిరిగిరావడానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతాయి. ఆదివారం కార్తీక అమావాస్య కావడం వల్ల గ్రహణం రావాల్సి ఉన్నా భారత్‌లో కనిపించలేదని నిపుణులు తెలిపారు. వ్యాపారులు ఆదివారం సాయంత్రం 6.02 గంటల నుంచి 8.35 గంటల మధ్య లక్ష్మీపూజలు నిర్వహించారు. చాలా మంది గృహస్తులు కొత్తగా కొనుగోలు చేసి బంగారు, వెండి ఆభరణాలకు కూడా పూజాధికాలు నిర్వహించారు. ముంబాదేవి, మహాలక్ష్మి, స్వామినారాయణ్ ఆలయాల్లో సంప్రదాయ చోప్డీ పూజ నిర్వహించారు. ‘దాదాపు వెయ్యి ఖాతా పుస్తకాలకు ఇక్కడ పూజలు చేశాం. ఇంతకుముందైతే చాలా పుస్తకాలు వచ్చేవి. అయితే చాలా మంది కంప్యూటర్లలోనే ఖాతాలను నిర్వహించడం వల్ల ఈ సంఖ్య తగ్గింది’ అని దాదర్ స్వామినారాయణ్ ఆలయ పూజారి నాగర్ తెలిపారు. కొందరు కంప్యూటర్ తెరముందు నోటుపుస్తకాలు ఉంచి చోప్డీ పూజ నిర్వహిస్తారు. దీపావళి పర్వదినాన స్నేహితులు, బంధువులకు మిఠాయిలు, కానుకలు తప్పనిసరిగా పంచాలని, దురదృష్టవశాత్తూ నగర జీవనశైలిలో ఈ సంప్రదాయం కనుమరుగవుతోందని నాగర్ అన్నారు. ఇక ముంబై మార్కెట్లన్నీ శని, ఆదివారాల్లో కళకళలాడాయి. పెద్ద ఎత్తున బాణసంచా విక్రయాలు జరిగాయి. షిర్డీలో ఘనంగా దీపోత్సవాలు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని షిర్డీలో ఘనంగా దీపోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఆబాలగోపాలం అంతా వేలాది దీపాలను వెలిగించారు. షిర్డీలోని ద్వారకమాయిలో దీపావళి సందర్భంగా నీటితోనే సాయిబాబా దీపాలను వెలిగించినట్టు భక్తులు చెబుతుంటారు. దీంతో ప్రతి దీపావళి పండుగ సందర్భంగా షిర్డీ ఆలయంలో దీపోత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి కూడా నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాది దీపాలను వెలిగించారు. దీంతో ఈ దీపాలను చూసేం దుకు భారీ ఎత్తున భక్తులు షిర్డీకి తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలతోపాటు దీపావళి సెల వుల కారణంగా షిర్డీలో భక్తుల రద్దీ కూడా గణనీయంగా పెరిగిందని ఆలయ ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు.