అంతా కరుణామయం
Published Thu, Dec 26 2013 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
గాంధీనగర్, (కాకినాడ) న్యూస్‌లైన్ :జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, జగ్గంపేట, తుని, కొత్తపేట, పిఠాపురంలలో రొమన్‌కేథలిక్, లూథరన్, మన్నా, దేవదా సు, బాప్టిస్టు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వృద్ధులకు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కాకినాడ సిటీలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో పాస్టర్ విజయ్‌కుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. వైఎస్సార్ సీపీ సిటీ కో-ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రెగ్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ బాబూరావు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. కాకినాడ రూరల్ ఏపీఎస్‌పీ బాప్టిస్ట్ చర్చిలో గొల్లప్రోలు క్రీస్తుసంఘ సువార్తీకులు ఎం.శామ్యూల్‌జోయల్ రాజు ప్రత్యేక సందేశాన్ని అందించారు. పిఠాపురం సెం టినరీ బాప్టిస్టు చర్చి, బెతస్థ బాప్టిస్టు చర్చిలలో వేడులకు ఘనం గా జరిగాయి.
రాజమండ్రి సెయింట్‌పాల్స్ లూథరిన్ చర్చి, దేవదాసు చర్చి, సెయింట్‌పాల్స్ ఈస్ట్ ప్యారిస్ చర్చి, సెయింట్‌థామస్ చర్చిలలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో జరిగిన వేడుకల్లో జైళ్ల శాఖ కోస్తా రీజియన్ డీఐజీ ఎ.నరసింహ పాల్గొన్నారు. అమలాపురం మన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వేడుకలు జరి గాయి. పాస్టర్ కారల్ డేవిడ్‌సన్ కొమనాపల్లి క్రీస్తు సందేశాన్ని అందించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు, పార్టీ మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి చర్చిలను సందర్శించి శుభాకాంక్షలు తెలి పారు. కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి నియోజకవర్గంలో పలు చర్చిలకు కేకులు బహుకరించారు. తుని సెయింట్ ఇమ్మానుయేలు బాప్టిస్టు చర్చిలో వేడుకలు నిర్వహించారు. కాకినాడ రూరల్ కరపలో వైఎస్సార్ సీపీ రూరల్ కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పలు చర్చిలను సందర్శించారు. కాకినాడ రేచర్లపేటలోని శాంతి సంఘం చర్చిలో నగర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ రాజారావు ప్రార్థనలు నిర్వహించారు.
Advertisement
Advertisement