
కేక్ కట్‌చేస్తున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి. చిత్రంలో ప్రపుల్లారెడ్డి తదితరులు
రహమత్‌నగర్: ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆరునెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా మన్ననలు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని రహమత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్‌హిల్స్, జూబ్లీహిల్స్‌లోని కార్మికనగర్, శ్రీనగర్‌కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వద్ద వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణతో పాటు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలకు దుప్పట్లను పార్టీ నేతలు అందజేశారు.
అనంతరం గట్టు మాట్లాడుతూ..ఎన్ని అవరోధాలు ఎదురైనా దివంగత మహానేత డా.వైఎస్సార్ చూపిన బాటలో అడుగుముందుకు వేసిన భగీరథుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేయడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఆ చట్టం వివరాలు కోరుతున్నాయంటే జగన్ దార్శనికత అర్థం అవుతుందన్నారు. ఈ వేడుకల్లో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు డా ప్రపుల్లారెడ్డి, బి సంజీవరావు, బెజ్జంకి అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు జశ్వంత్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.