
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం (21న) ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీనాయకులు, అభిమానులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. జగన్ జన్మదినం సందర్భంగా దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని, రక్త, అన్నదాన శిబిరాల నిర్వహణతో పాటు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment