
కోదాడ అర్బన్: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిలకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తాల ముత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు పిల్లి మరియదాసు, దేవిరెడ్డి లింగారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, వాసు, విజయ్, రవీందర్, శ్రీకాంత్, వెంకన్న, రామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment