
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బెజ్జంకి అనిల్ కుమార్, బి. సంజీవ్‌రావు నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిపినట్టు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా యలమంద నాయక్, పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా బెజ్జంకి అనిల్‌కుమార్, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్‌గా నాగదేశి రవికుమార్, ఆదిలాబాద్ ఇన్‌చార్జ్‌గా అక్కెనపల్లి కుమార్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కాంపెల్లి గంగాధర్, జోగుళాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రాజశేఖర్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు.
అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా: అదేవిధంగా పార్టీ అంబర్‌పేట్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా ఎ. అవినాశ్‌గౌడ్, సూర్యాపేట అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా పిట్ట రాంరెడ్డి, కోడంగల్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా తమ్మళి బాల్‌రాజ్, ముషీరాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా సూరిబాబు, తంగతుర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా బాలెంల మధులను నియమిస్తున్నట్లు గట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఇమామ్ హుస్సేన్ (శేరిలింగంపల్లి), మేస్రం శంకర్ (ఆదిలాబాద్), తాళ్లూరి వెంక టేశ్వర్లు (మంచిర్యాల), పిండి శ్రీకాంత్ రెడ్డి (ఎల్‌బీ నగర్), బి. మోహన్ రెడ్డి (పరిగి), దుబ్బాక గోపాల్ రెడ్డి (ఎల్‌బీ నగర్), దారెల్లి అశోక్ (మధిర), వారాల శ్రీనివాస్ (కరీంనగర్), మామిడి సంగమేశ్వర్ (వికారాబాద్), బి. రవీందర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా సూరగంటి సుధాకర్ రెడ్డి(ఎల్‌బీ నగర్), కడపర్తి తిలక్‌రావు (నిర్మల్)లను నియమించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment