
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టాలను తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు చుట్టాలుగా మార్చుకుని ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు.
అంబేడ్కర్ 127వ జయంతిని శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దాదా సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి వచ్చే ప్రతిమాటకు అంబేడ్కరే స్ఫూర్తి అన్నారు.
వైఎస్ జగన్ నాయకత్వంలో అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి మతీన్, ప్రధాన కార్యదర్శి సంజీవరావు, రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, వైఎస్సార్ సీపీ ఏపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నంద మూరి లక్ష్మీపార్వతి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్ మాట్లాడారు.
అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బెంబిడి శ్రీనివాస్‌రెడ్డి, చల్లా మధు, బి.మోహన్ కుమార్, పాలెం రఘునాథ్‌రెడ్డి, ఎం. సుధాకర్ రెడ్డి, సూరిబాబు, బుర్రా సురేశ్‌గౌడ్, బీవీఆర్ మోహన్‌రావు, రాజరాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment